ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకే రెండు హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా విరిద్దరి కాంబినేషన్ లో వస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా సోషల్ మీడియాలో రికార్టులు సృష్టిస్తోంది.
ప్రధానంగా పుష్ప మూవీ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ తరువాత ఆకర్లో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే లే అనే డైలాగ్ హైలైట్‌గా అందరిని ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి మొదటి పాటని ఐదు భాషల్లో, ఐదుగురు గాయకులతో పాడించారు. ఆ పాటు దాక్కో దాక్కో మేక.. అని సాగుతుంది. ఇంతకు ముందే ఈ పాట విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. తాజాగా ఈ పాటకు సంబంధించి మినీ ప్రోమోని రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లో అల్లు అర్జున్ నోట్లో కత్తి పెట్టుకొని అభిమానులనుఉర్రూతలూగించారు. మొత్తం 11 సెకన్ల నిడివి గల ఈ లిరిక్ ప్రోమో సూచిన వంటెనే పాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ మదిలోకి వెళ్లిపోతోంది. మొత్తం పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 25న పుష్ప సినిమాను విడదుల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.