26/11 ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క ఈ సినిమాని తెరకెక్కించాడు. అడవి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గా నటించి సర్వత్రా ప్రశంసలు పొందాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. అడవి శేష్ కెరీర్లోనే టాప్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది.
జులై 3 నుంచి మేజర్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే థియేటర్లలోనే కాదు.. మేజర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా మేజర్ సినిమాకు ఓటీటీలోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ గ్ చిత్రాల్లో మేజర్ మూవీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.
#India #Pakistan #Bangladesh #SriLanka NUMBER 1 #MAJOR 🇮🇳❤️ pic.twitter.com/R1G6tIWPTG
— Adivi Sesh (@AdiviSesh) July 8, 2022
ఒక్క ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్ లోనూ మేజర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1, 2 స్థానాల్లో కొనసాగడం గమనార్హం. బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ మేజర్ సినిమా ట్రెండింగ్ లో ఉంది. హిందీ వర్షన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. తెలుగు వర్షన్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. అందుకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ స్క్రీన్ షాట్స్ ను అడవి శేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. మేజర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.