అలియా భట్.. బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నా కూడా టాలీవుడ్ లో మాత్రం ట్రిపులార్ లో ‘సీత’ లాగానే ప్రేక్షకులకు పరిచయం. ఇటీవలే ప్రియుడితో పెళ్లి కావడం.. తర్వాత కొద్దిరోజులకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అలియా భట్ జీవితంలోని ఈ మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా రణ్వీర్ సింగ్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి హాజరైన అలియా భట్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాఫీ విత్ కరణ్ షో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో సీజన్ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. మొదటి ఎపిసోడ్ అతిథులుగా వచ్చిన రణ్వీర్ సింగ్, అలియా భట్ గోల గోల చేశారు. రణ్వీర్ సింగ్ తన సహజమైన కామెడీ, బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయించాడు. ఇంక అలియా భట్ అయితే అన్ని ప్రశ్నలకు ఎంతో ఓపెన్ గా బోల్డ్ గా సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) ఆమె చెప్పిన కొన్ని సమాధానాల్లో ప్రస్తుతం పెళ్లి- తొలి రాత్రికి సంబంధించిన ఆన్సర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి- ఫస్ట్ నైట్ పై మీ అభిప్రాయాలు చెప్పాలంటూ అలియాని కోరగా.. “పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అని ఏమీ ఉండదు.. ఆ సమయానికి అలిసిపోయి ఉంటాము” అంటూ అలియా బోల్డ్ కామెంట్ చేసింది. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) ఇంక సినిమాల విషయానికి వస్తే.. అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా విడుదల కానుంది. అయితే అలియా ప్రస్తుతం గర్భవతి కాబట్టి.. మరి తర్వాతి భాగాల్లో ఆమె ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అలియా భట్ చేసిన బోల్డ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: సీనియర్ నటుడు శివాజీ గణేశన్ ఇంట్లో వివాదం.. కోర్టు మెట్లెక్కిన కుమార్తెలు! ఇదీ చదవండి: మరో సారి డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ప్రగతి!