కృష్ణవంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. అనేక విభిన్న చిత్రాలను తెరకెక్కించిన వంశీ.. తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఖడ్గం' మూవీ అప్పట్లో ఓ సెన్సెషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ 2002 విడుదలైంది. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషించగా.. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్లో హైలెట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చేవుల్లో మార్మోమోగుతూనే ఉంటాయి. తాజాాగా ఆ సినిమా స్వీకెల్ పై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కృష్ణ వంశీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కృష్ణవంశీ చేసిన కామెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో పాతబస్తీలో ఉండేవారిని తీవ్రవాదులుగా చూపించడం.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిలా చూపించడంపై అప్పట్లోనే దూమారం రేగింది. అప్పట్లో ఓ వర్గం వారు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాక కొన్ని చోట్ల థియేటర్లపై దాడులు కూడా చేశారు. ఖడ్గం మూవీ విడుదలైన తర్వాత కృష్ణవంశీ ప్రాణభయంతో వారం రోజులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారని టాక్ కూడా ఉంది. ఆ మూవీకి ఇప్పటి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ ఖడ్గం మూవీ గురించి కృష్ణ వంశీ సమాధానం ఇచ్చారు. ''మీ నుంచి ఖడ్గం లాంటి మూవీ కోసం వెయిటింగ్' అని ఓ నెటిజన్ అడగ్గా.. 'ఇప్పుడైతే చంపేస్తారేమో సార్' అంటూ ఫన్నీగా నవ్వుతూ రిప్లై ఇచ్చాడు కృష్ణవంశీ. ప్రస్తుతం జరుగుతున్న కాంట్రావర్సీలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. చాలా కాలం విరామం తరువాత ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న మూవీ 'రంగమార్తాండ'. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ మూవీతో కృష్ణవంశీ బౌన్స్ బ్యాక్ ఇస్తారని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఖడ్గం మూవీ విషయంలో కృష్ణ వంశీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Day 8 .# rangamarthanda... GOD on work ... Elixir ❤️ — Krishna Vamsi (@director_kv) June 15, 2022 ఇదీ చదవండి: Abijeet: బిగ్ బాస్ విన్నర్ అయ్యాక అజ్ఞాతంలో ఉండటానికి కారణం చెప్పిన అభిజిత్!