అభిజీత్.. బిగ్ బాస్ తెలుగు సీజన్-4 టైటిల్ కొట్టిన తర్వాత ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ, అభిజిత్ మాత్రం అలాంటివి ఏమీ చెయ్యకుండా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలం వరకు మీడియా, సోషల్ మీడియా ఎక్కడా కనిపించలేదు. ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది లేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు సోషల్ మీడాయలో లైవ్ లోకి వచ్చి.. తనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే అందుకే బయటకు రావడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. హెల్త్ కి ప్రయారిటీ ఇవ్వడం వల్లే సినిమా ప్రాజెక్టులు ఒప్పుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా అభిజిత్ నటించిన ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ జులై 8న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అభిజిత్ ఇంతకాలం తాను సినిమాలకు, అభిమానులకు ఎందుకు దూరంగా గడిపాడు? అందుకు గల కారణాలు ఏంటి? అనే అంశాలపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అభిజిత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అభిజిత్ చేసిన వ్యాఖ్యలను ఈ కింది వీడియోలో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: నటి సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ! ఇదీ చదవండి: ప్రమోషన్ కోసం పురుగును తిన్న రణవీర్ సింగ్! వీడియో వైరల్