ఫిల్మ్ డెస్క్- అమితాబ్ బచ్చన్.. సుమారు 20ఏళ్ల పాటు బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. అప్పటి వరకు భారతీయ సినిమా ఒక ఎత్తైతే.. అమితాబ్ వచ్చాక మరో ఎత్తు. బాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ ను సినిమాల్లో చూసి ప్రేరణగా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు ప్రేమమగా అమితాబ్ బచ్చన్ ను బిగ్ బి అని పిలుచుకుంటారు.
ఇక సినిమాల్లో నటించినంత వరకు అమితాబ్ కు తిరుగులేదని చెప్పవచ్చు. అప్పట్లో బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా అమితాబ్. ఐతే ఆ తరువాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాక అమితాబ్ బచ్చన్ ఆర్ధికంగా చితికిపోయారు. డబ్బులే కాదు, పేరు, ప్రతిష్టలను కూడా కోల్పోయారు బిగ్ బి. సుమారు పదేళ్లపాటు అమితాబ్ అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
1998లో అమితాబ్ బచ్చన్ ఓ సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. అమితాబ్ వచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్ లో పలు సినిమాలను నిర్మించారు. ఐతే అమితాబ్ నిర్మించిన సినమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమితాబ్ అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులన్నీ కరిగిపోతవడమే కాకుండా, భారీగా అప్పులు చేశారు.
1999లో అమితాబ్ బచ్చన్ చేసిన అప్పులు సుమారు 900 కోట్ల రూపాయలు. ఇక అమితాబ్ ఆర్ధికంగా చితికిపోయాక అప్పుల వాళ్లు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అప్పటి వరకు సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలకు మసక బారింది. అప్పుల వాళ్ల చేసిన అవమానాలకు అమితాబ్ బాగా క్రుంగిపోయారు. కొన్ని సందర్బాల్లో అప్పులవాళ్ల బెదిరింపులకు బిగ్ బి భయపడిపోయారు. మిగతా విషయాలు పార్ట్ 2లో చదవిండి.