టెలివిజన్ రంగంలో ఎంటర్‌టైన్ మెంట్ తోపాటు విజ్ఞానాన్ని అందించిన షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ . 2000 సంవత్సరం నుంచి ఆ షోకి వ్యాఖ్యాతగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరించారు అమితాబ్ బచ్చన్.
టెలివిజన్ రంగంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వచ్చాయి.. ప్రజలను ఎంతగానో అలరించాయి. అయితే మొదటిసారిగా ప్రేక్షకులను మేథస్సు పదును పెట్టే ప్రోగ్రామ్ గా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టెలివిజన్ రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది . కౌన్ బనేగా కరోడ్‌పతి అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ ఆధారిత గేమ్ షోలలో ఒకటి. ఈ షోకి 2000 సంవత్సరం నుంచి హోస్ట్ గా చేస్తున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ తో ప్రూవ్ చేసుకోవడమే కాదు.. డబ్బు కూడా గెల్చుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే.. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్‌పతి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి సెన్సేషన్ సృష్టించాడు ఓ కుర్రోడు. వివరాల్లోకి వెళితే..
టెలివిజన్ రగంలో వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించిన షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. 2000 సంవత్సరం నుంచి ఆ షో కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హూస్ట్ గా కొనసాగుతున్నారు. బుల్లితెరపై ఎన్ని కార్యక్రమాలు వచ్చినా.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. కేవలం అమితాబ్ బచ్చన్ కారణంగానే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది అని అంటారు. కంటెస్టెంట్స్ తో ఆయన మాట్లాడే విధానంతో పాటు నడుచుకునే తీరుకు ప్రేక్షకులు బాగా ఆకర్షితులయ్యారు. ఈ షోలో ఎంతోమంది కంటెస్టెంట్లు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడమే కాదు.. డబ్బు కూడా బాగానే గెలుచుకున్నారు. 2011 ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో 14 కుర్రాడు రవి మోహన్ సైనీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అమితాబ్ బచ్చన్ అడిగిన 15 కఠినమైన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు ఇచ్చి సంచలనం రేపాడు.
రవి మోహన్ సైనీ చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడు. క్లాస్ లో ఎప్పుడూ నెంబర్ వన్ స్టూడెంట్ గా ఉంటూ వచ్చాడు. రవి 10వ తగరతి చదివే సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకి బాగా ఆకర్షితుడయ్యాడు. మొదటి నుంచి అమితాబబ్ బచ్చన్ అంటే ఇష్టపడే రవి ఆ షోలో పాల్గొని ఆయను కలవాలని కోరుకునేవాడు. మొత్తానికి ఆ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి చిన్నవయసులోనే ఒక స్టార్ గా నిలిచాడు. అప్పటి నుంచి రవి విజయ పరంపర సాగించాడు.
రవి జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు. అంతటితో తృప్తి పడలేదు.. జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపనతో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్‌గా అప్పట్లో వార్తల్లో నిలిచాడు. 34 ఏళ్ల వయసులో 2021 లో గుజరాత్ లోని పోర్‌బందర్ కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. అయితే రవి యూపీఎస్‌సీ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోపోవడం మరో విశేషం. నేవీ అధికారి అయిన తన తండ్రి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరానని అంటున్నారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. ప్రస్తుతం సొసైటీలో ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84
— SP Porbandar (@SP_Porbandar) June 13, 2023