ఇండస్ట్రీలోకి యాక్టర్స్ గా ఎప్పటికప్పుడు ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ.. యాక్టర్ అవ్వాలని వచ్చి.. తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేవారు కొంతమందే ఉంటారు. అందరిలాగే సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తాను అందరిలా కాదని.. ఇండస్ట్రీలో ఒకరిగా కాకుండా ఇండస్ట్రీని ఏలడానికి వచ్చానని ప్రూవ్ చేశాడు. అతన్ని మీరు పైన ఫోటోలో చూస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలోకి యాక్టర్స్ గా ఎప్పటికప్పుడు ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ.. యాక్టర్ అవ్వాలని వచ్చి.. తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేవారు కొంతమందే ఉంటారు. అందరిలాగే సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తాను అందరిలా కాదని.. ఇండస్ట్రీలో ఒకరిగా కాకుండా ఇండస్ట్రీని ఏలడానికి వచ్చానని ప్రూవ్ చేశాడు. అతన్ని మీరు పైన ఫోటోలో చూస్తున్నారు. ఆయన గురించి కొత్త, పాత.. ఇలా ఏ తరానికి కూడా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ లో ఎవర్ గ్రీన్ హీరో. దశాబ్దాలుగా నటుడిగా కంటిన్యూ అవుతూనే.. వయసుతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు.
ఇప్పుడున్న మాస్, క్లాస్, కమర్షియల్ డైరెక్టర్స్ అందరూ ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. దర్శకులు మాత్రమే కాదు.. ఆల్ ఇండియా వైడ్ హీరోలంతా ఈయనకు పెద్ద ఫ్యాన్స్. ప్రతి భాషలో గొప్ప స్టార్స్ ఉండొచ్చు. కానీ.. ఆ గొప్ప స్టార్స్ మోటివేషన్ వెనుక పై ఫొటోలో ఉన్న సెలబ్రిటీ ఉంటారు. ఇన్ని క్లూస్ ఇచ్చాక ఆయన ఎవరో మీకు ఆల్రెడీ అర్తమై ఉంటుంది. ఎస్.. మీరు అనుకుంటుంది నిజమే.. బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇండియన్ మెగాస్టార్ అని అందరూ పిలుస్తుంటారు. కెరీర్ లో అమితాబ్ ఎన్ని సినిమాలు చేశాడు? ఎన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టాడు? అనేది పాయింట్ కాదు. జనాలలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు? ఎలా అందరికీ ఇన్స్పైర్ చేశాడు? అనేది ప్రధానం.
ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్ళు. అయినా ఇంకా కష్టపడుతూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చూడని అవార్డులు, రివార్డులు లేవు. ఆయన హీరోగా కెరీర్ ఆరంభించి 54 ఏళ్ళు అవుతోంది. హీరోగా దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలిన అమితాబ్.. కొన్నేళ్లుగా కీలకపాత్రలు పోషిస్తూ.. తనదైన ఉనికి చాటుతున్నారు. ముఖ్యంగా హిందీ మాత్రమే కాకుండా.. తెలుగులోను పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. తెలుగులోనే అమితాబ్ కి కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారంటే.. ఆయన స్థాయి, క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అమితాబ్ కి సంబంధించి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు చూసిన అమితాబ్, మీకు తెలిసిన అమితాబ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.