Rosalia Lombardo: మీకు మమ్మీల గురించి తెలిసే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం ఈజిప్షియన్లు చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరిచి ఉంచారు. అలా భద్రపరచబడ్డ మృతదేహాలనే మమ్మీలు అంటున్నారు. కేవలం ఈజిప్టులోనే కాదు.. ప్రపంచంలోని చాలా చోట్ల మమ్మిఫికేషన్ వాడుకలో ఉండింది. మమ్మిఫికేషన్ ద్వారా భద్రపరిచిన మమ్మీలు తవ్వకాలు జరిపినపుడు బయటపడుతూ వస్తున్నాయి. అలా బయటపడ్డ వాటిలో కొన్నింటికి వేల ఏళ్ల చరిత్ర.. మరికొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినవి ఉన్నాయి. వీటన్నింటికి కామన్ పోలిక ఏంటంటే.. అవి వాడిపోయిన మునక్కాడల్లా మారిపోయి ఉండటం.
అయితే, వీటికి.. సిసిలి దేశానికి చెందిన 2 ఏళ్ల పాప మమ్మీకి చాలా తేడా ఉంది. ఆ పాప మరణించి వందేళ్లు అయినా పాప మృతదేహం ఇంకా అలానే ఉంది. దాన్ని చూస్తే పాప నిద్రపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ సంగతేంటంటే.. సిసిలీలోని పలెర్మోకు చెందిన రోసాలియా లంబార్డో అనే బాలిక రెండేళ్ల వయసులో 1920 డిసెంబర్ 2వ తేదీన నిమోనియాతో చనిపోయింది. రోసాలియా మృతిని ఆమె తండ్రి తట్టుకోలేకపోయాడు. తన కూతురు మృతదేహాన్ని భద్రపర్చాలనుకున్నాడు. ఆల్ఫ్రెడో సలాఫియా అనే ప్రముఖ ఎంబాల్మర్‌ను పిలిపించాడు.
తన కూతురు శవాన్ని భద్రపర్చాలని చెప్పాడు. ఆల్ఫ్రెడో.. ఫార్మలిన్, జింక్, ఆల్కహాల్, సాలిసిలిక్ యాసిడ్, గ్లిజరిన్‌ను పాప శరీరంలోకి ఎక్కించి ఓ గాజు, చెక్కతో తయారు చేసిన సమాధిలో భద్రపరిచాడు. ప్రస్తుతం ఆ పాప మమ్మీ పాలెర్మోస్‌లోని మమ్మీల మ్యూజియంలో భద్రంగా ఉంది. జట్టు, ముఖం చూస్తే పాప నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. కేవలం ఈ పాప మమ్మీని చూడటం కోసం జనం ఆ మ్యూజియానికి క్యూకడుతున్నారు.
వాళ్లలో చాలా మందికి పాప కళ్లు మూసి తెరుస్తున్నట్లు అనిపించిందంట. మరి, 100 ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా ఉన్న రోసాలియా మమ్మీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇదేం పాడుపని.. కుక్కతో సంబంధం పెట్టుకున్న మహిళ!