అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో ‘కేజీఎఫ్‘ చిత్రం శాండిల్‌వుడ్‌లో పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. కన్నడ భాషా పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇందులో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కే దక్కుతుంది. కేజీఎఫ్-1తో.. శాండిల్‌వుడ్‌కు గుర్తింపు రాగా.. కేజీఎఫ్-2తో కన్నడ చాల చిత్ర పరిశ్రమ దేశానికి తమ ఉనికిని గర్వంగా చాటుకుంది. కేజీఎఫ్ చాప్టర్-2.. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. విడుదలైన మొదటి రోజే 130 కోట్ల కలెక్షన్లను సాధించి హైయెస్ట్ డే-1 రికార్డులలో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో వాళ్ళ సినిమాలను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే చాప్టర్-2 చిత్రం ఎండింగ్‌లో చాప్టర్-3 ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్-3కి సంబంధించి హీరో యష్ కొన్ని లీకులిచ్చారు. చాప్టర్ 3లో మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతోన్నట్టు యష్ తెలిపారు. కొన్ని ఆక్షన్ సన్నివేశాల గురించి తాను, ప్రశాంత్ ముందే అనుకున్నామని యష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు యాక్షన్ సీన్స్ అంటే.. కేజీఎఫ్- 1, 2 అని అభిమానులు అనుకుంతున్నారు. ఈ సమయంలో యష్ చేసిన వ్యాఖ్యలతో.. చాప్టర్- 3లో యాక్షన్ సీన్స్ ఇంక ఏ రేంజ్ లో ఉంటాయో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
😳😲😲
Gangster escaped using Submarine, #KGFChapter2 #KGFChapter3 @hombalefilms @TheNameIsYash pic.twitter.com/xMBlg14BKY— Gururaj Monster ⚡ (@AppuAddicter1) April 20, 2022
ఇది కూడా చదవండి: KGF Yash: భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాకింగ్ స్టార్ యశ్! ఫొటోస్ వైరల్
‘కన్నడ పరిశ్రమను, దేశంలోని ఇతర పరిశ్రమలు తక్కువ చేసి మాట్లాడినప్పుడు తనను ఎంతగానో బాధించిందని’ యష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ‘కేజీఎఫ్’ శాండల్ వుడ్ గేమ్ చేంజర్ గా చూడటం ఆనందంగా ఉంది” అని యష్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గురించి మీరు ఎలా భావిస్తున్నారని అడిగినప్పుడు.. హాలీవుడ్ లో టెక్నాలజీ వాడకం ఎక్కువ, అందుకు తగ్గట్టుగానే.. బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ మన దగ్గర కంటెంట్ కు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టే మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అలరిస్తున్నాయి” అని అన్నాడు. యష్ తజా వ్యాఖ్యల నేపథ్యంలో.. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 లా.. కేజీఎఫ్-3 బాక్సాఫీస్ ను ఎలా బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.
Rocky bhai escapes using submarine KGF Chapter 3 loading 🔥🔥🔥🔥🔥#KGFChapter2 | #KGFChapter3 pic.twitter.com/b3XlmDcU77
— Manikarthi MK (@MKs_Kingdom) April 22, 2022
We have only one question to ask you.
Mr @prashanth_neel sir and @hombalefilms
Can you tell me how many more years we will have to wait for the KGF Chapter-3 Release ? ☺️
.
.
.#kgfverse #KGF2 #KGF3update #waitingforkgf3 #PrashanthNeel #HombaleFilms #YashBOSS𓃵 pic.twitter.com/X5Ah1iFJWZ— Sibin Michael (@Sibin__Michael) April 20, 2022