సినీ ఇండస్ట్రీలోని నటీనటులు ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉంటారు. ఎప్పుడన్న కాస్త విరామం దొరికితే పార్టీలకు, పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. పెళ్లిల్లు ఫంక్షన్లకు హాజరవుతుంటారు. దీనికి సంబంధించి ఓ స్టార్ హీరో, హీరోయిన్ ఓ పార్టీలో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రమ్యకృష్ణ. తన అందం, నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది. దాదాపు తెలుగు సినిమా అగ్ర హీరోలందరితో రమ్యకృష్ణ నటించింది. రమ్యకృష్ణ నటిస్తే చాలు మా సినిమాలు హిట్ అవుతాయని నిర్మాతలు అనుకునే స్థాయికి ఎదిగింది. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌలి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాహుబలిలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ ఆ పాత్ర కు ప్రాణం పోసింది. శివగామి పాత్ర రమ్యకృష్ణకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టింది.
కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ అయిన కన్నడ నటుడు యష్ అశేషమైన అభిమానులను సంపాధించుకున్నారు. కెజిఎఫ్ సినిమాతో రికార్డులను తిరగ రాశాడు. రాకీ భాయ్ పాత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లేల చేశాడు. యష్ మొదటగా టివి షోలు, సీరియల్స్ తో తెరపైకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు లభించాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
కాగా శివగామి పాత్రలో అలరించిన రమ్యకృష్ణ, కెజిఎఫ్ తో రాకీభాయ్ పాత్రలో అదరగొట్టిన యష్ కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి రమ్యకృష్ణ, యష్ అటెండ్ అయ్యారు. ఆ పార్టీలో వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.