బుల్లితెర మెగాస్టార్ అనిపించుకునేంత స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా సుధీర్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. కేవలం సుధీర్ కారణంగానే టి.ఆర్.పి రేటింగ్స్ లో దూసుకుపోయిన షోలు చాలానే ఉన్నాయి. జబర్దస్త్ కాకుండా.. సుధీర్ కి ఐకానిక్ షోగా నిలిచింది మాత్రం “ఢీ” నే. ఢీలో డ్యాన్సర్స్ వేసే స్టెప్పులు కన్నా, సుధీర్ పండించే కామెడీనే హైలెట్ గా నిలుస్తూ వచ్చింది. ఢీ-13 వరకు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగింది. కానీ.., ఎవ్వరు ఊహించని విధంగా సుధీర్ ఢీ-14 లో కనిపించకుండా పోయాడు.
షో యాజమాన్యం కొత్తదనం కోరుకుందో, లేక వేరే కారణాల రీత్యానో సుధీర్ ఢీ స్టేజ్ కి దూరమయ్యాడు. ఇక సుధీర్ ప్లేస్ లో చాలామంది యాంకర్స్ వచ్చినా ఆ ఇంప్యాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. దీంతో.. ఇప్పుడు ఢీ రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ సుధీర్ ఢీ షోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుధీర్ ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కనిపిస్తున్నాడు. ఈ రెండు షోలు మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి.
ఇక ఢీ-13 వరకు కూడా ఢీ రేటింగ్స్ కి ఢోకా లేకుండా ఉండింది. కానీ.. ఎప్పుడైతే సుధీర్ షో నుండి బయటకి వెళ్లిపోయాడో అప్పటి నుండే ఢీ రేటింగ్ సగానికి పడిపోయిందట. దీంతో.. మళ్ళీ పాత బ్యాచ్ ని రంగంలోకి దింపాలని షో యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో.. ఢీలోకి సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. మరి.. సుడిగాలి సుధీర్ రాకతో ఢీ రేటింగ్స్ మళ్ళీ ఊపు అందుకుంటాయా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.