హీరోయిన్ల వయసు పెరిగేకొద్ది లుక్ మారిపోతుంది. ఈమె హాట్ నెస్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప అస్సలు తగ్గట్లేదు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
సినిమాల చేసినంత కాలం హీరోయిన్లని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఛాన్సులు లేకపోయినా, మూవీస్ చేయకపోయినా ఇట్టే మరిచిపోతారు. అవేం లేకపోయినా సరే గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం సదరు హీరోయిన్లలో విషయం ఉండాలి. ఈమెకు అలాంటి టాలెంట్ బోలోడంత ఉంది. ఒంపుసొంపులు, గ్లామర్ చూస్తే మీరేంటి తయారుచేసిన బ్రహ్మా కూడా మెంటలెక్కిపోతాడు. మరి తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ హీరోయిన్ పుట్టి పెరిగింది అంతా ముంబయిలోనే. మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది. అందరిలానే తొలి సినిమా తెలుగులోనే చేసింది. అది కూడా 2008లో. అప్పుడెలా ఉందో ఇప్పటికీ అలానే ఫిజిక్ మెంటైన్ చేస్తూ వస్తోంది. అవును మీలో కొంతమంది గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు శ్రద్ధా దాస్. ప్రస్తుతం ఢీ డ్యాన్స్ షోకి జడ్జిగా చేస్తూ ఫుల్ ఫేమ్ సంపాదించింది. హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటే.. డ్యాన్స్ షోకి జడ్జిగా తెలుగు రాష్ట్రాల్లో యూత్ కి ఫేవరెట్ అయిపోయింది.
‘సిద్ధూ ఫ్రం సికాకుళం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్.. ‘ఆర్య 2’ డిఫరెంట్ రోల్ చేసి అందరి కంట్లో పడింది. ఆ తర్వాత ‘డార్లింగ్’, ‘మొగుడు’ ఎంటర్ టైన్ చేసింది. ‘గుంటూర్ టాకీస్’లో లేడీ డాన్ గా సరికొత్త అవతార్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. తెలుగులో చివరగా ‘ఏక్ మినీ కథ’లో కనిపించిన శ్రద్ధా.. ప్రస్తుతానికైతే పలు సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల సంగతేమో గానీ ఈమె గ్లామర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతూనే ఉంటుంది. 36 ఏళ్లుగానీ అస్సలు అలా ఉండదు. 16 ఏళ్ల పడుచు పిల్లలా ఉంటుంది. సరే ఇదంతా వదిలేయండి గానీ ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.