తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనౌన్స్ ప్రెస్ మీట్ విషయం మార్నింగ్ నుండి హాట్ టాపిక్ గా మారింది. సాయంత్రం మీడియాతో మీటింగ్ ఉందని అరవింద్ ప్రకటించేసరికి చాలా విషయాలపై మాట్లాడబోతున్నారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, అనూహ్యంగా అరవింద్ ప్రెస్ మీట్ క్యాన్సల్ చేశారని వార్త బయటికి రావడంతో.. అసలు అరవింద్ చుట్టూ టాలీవుడ్ లో ఏం జరుగుతోందని, ఎందుకు మీటింగ్ అనౌన్స్ చేసి మళ్లీ క్యాన్సల్ చేశారు? జనాలలో అయితే కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ.. నిర్మాత అరవింద్ చెప్పాలనుకున్న విషయాలు ఆయన లిస్ట్ లో ఉన్నాయా లేదా? అనేవి తెలియాల్సి ఉంది.
ఇలాంటి తరుణంలో ప్రెస్ మీట్ క్యాన్సల్ అంటే.. ఖచ్చితంగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడానికి కారణం ఏంటి? అనేది దానిపై గట్టిగా చర్చించుకుంటున్నారు జనాలు. బాలయ్య నర్సులపై చేసిన కామెంట్ గురించేనా అని ముందుగా అనుకున్నారు. మధ్యాహ్నానికి విషయం బాలయ్య గురించి కాదు.. విజయ్ దేవరకొండ – డైరెక్టర్ పరశురామ్ ల గురించి అని టాపిక్ మారింది. వీటిలో దీనిపై అరవింద్ మాట్లాడబోతున్నారు? వేరే ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉందా? అనుకుని అందరూ మీట్ కి సన్నద్ధం అయ్యేలోపు క్యాన్సల్ అనేసరికి అందరిలోనూ మరిన్ని సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా.. దిల్ రాజు – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో పరశురామ్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో పరశురామ్ పై అల్లు అరవింద్ కోపంగా ఉన్నారని, ఇప్పుడంతా బాగున్న టైంలో వివాదాలు రేకెత్తితే కష్టమని ప్రొడ్యూసర్స్ గిల్డ్ రిక్వెస్ట్ చేయడంతో అరవింద్ మీట్ క్యాన్సల్ చేశారని మరో టాక్. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో ‘గీతగోవిందం 2’ తీయాలని తన దగ్గర ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ ని పక్కనపెట్టి.. కొత్తగా దిల్ రాజుతో పరశురామ్ మూవీ అనౌన్స్ చేయడం వల్లే ఇప్పుడీ వివాదం చోటుచేసుకుందని వినికిడి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది అల్లు అరవింద్, దిల్ రాజు, విజయ్, పరశురామ్ లే క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. మరి ఈ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ని క్యాన్సల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Representatives of Producers Guild requested #AlluAravind to call off the Pressmeet and settle the issue in Private. Press conference cancelled
— Lets OTT (@IetsOTT) February 6, 2023
#AlluAravind has scheduled a press conference this evening to address an important issue… will it be #AlluArvind or #DilRaju?#GeethaGovindam pic.twitter.com/DUfngidQmi
— Lets OTT (@IetsOTT) February 6, 2023
Apparently, #AlluAravind paid advance to Parasuram Petla for #GeethaGovindam Combination film.
Now they are doing it for #Dilraju. This evening, Allu Aravind will speak about this issue in a press meet.#Tollywood pic.twitter.com/moWQzRJ7Lv
— Ravi Teja Joy (@RaviTejaJoy) February 6, 2023