SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Who Is Tiger Nageswararao Why His Name In Lime Light Now

ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? రెండు బయోపిక్ లు తీస్తున్నారంటే..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 6 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? రెండు బయోపిక్ లు తీస్తున్నారంటే..

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఒక బయోపిక్‌ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇలా పోటీ పడి మరి సినిమాలు తీస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. అది కూడా ఏ స్వాతంత్ర్య సమరయోధుడి కధ కాదు.. ఒక స్టవర్టుపురం దొంగ గురించి. మాస్‌ మహారాజ రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘స్టువర్టుపురం దొంగ’గా పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. దొంగ అయితే ఎందుకు అతనికి అంత క్రేజ్? బయోపిక్‌ లు కూడా తీసేంతలా నాగేశ్వరరావు కాదు.. టైగర్‌ నాగేశ్వరరావు ఏం సాధించాడు? వంటి ఆసక్తికర విషయాలు మీకోసం.

స్టువర్టుపురం ఎలా పుట్టింది?

1913లో ఎరుకుల కులస్థులను క్రిమినల్సుగా ముద్రవేసి.. జైలుకు బదులుగా వారందరిని ఒక కాలనీగా ఏర్పాటు చేశారు. అదే స్టువర్టుపురం అయ్యింది. గుంటూరు జిల్లా బాపట్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్టువర్టుపురం. ఇది ప్రకాశం జిల్లాతోనూ సరిహద్దును పంచుకుంటుంది. అటు గుంటూరు జిల్లా ఇటు ప్రకాశం జిల్లాలకు చెందిందిగా కూడా చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే వ్యవసాయం, చేతి వృత్తులు, ఉద్యోగాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వారికి చేసేందుకు పని ఉండేది కాదు.. కుటుంబాన్ని పోషించాలన్నా, నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లాలన్నా వారికి ఉన్న దారి దొంగతనం. మొదట్లో వీళ్లను బలవంతంగా ఈ వృత్తిలోకి దించారని అంటారు. ఆ తర్వాత పోషణ కోసం తప్పక ఆ దారి పట్టారని చెప్తుంటారు. వాళ్లు ఆ వృత్తిని వదిలేశారు కానీ, ఇప్పటికీ అది మాత్రం వాళ్లను వదలట్లేదు. స్టువర్టుపురం అనగానే అబ్బో దొంగలురా అనే తరహా పరిస్థితులు వాళ్లకు తారస పడుతూనే ఉంటాయి. వారి పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్లు వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. హుందాగా బ్రతుకుతున్నారు.

టైగర్‌ నాగేశ్వరరావు ఎవరు?

స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగువ, ధైర్యానికి టైగర్‌ అని బిరుదు కూడా వచ్చింది. అతను అందరి దొంగల్లా కాదు.. ఇంగ్లీష్‌ కథల్లో ఉండే రాబిన్‌ హుడ్‌ తరహా దొంగ అనమాట. అంటే ఉన్నవాళ్ల జేబు కొట్టి.. లేనివాళ్ల కడుపు నింపే రకం దొంగ. స్టువర్టుపురంలో పుట్టి పెరగడం వల్ల అతనికి చదువుకునే అవకాశం దక్కలేదు. అందువల్ల కూడా కావచ్చు అతను దోచుకున్న సొమ్ముతో ఎంతో మందిని చదివించాడని కూడా చెప్పుకుంటారు. అతను అందరిలాంటి దొంగ కాదు. ఒకానొక సమంయలో మద్రాసు జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. అతడిని పట్టుకోవడం అంత సామాన్యం కాదు. చిక్కినట్టే చిక్కి జారుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. 1970ల సమయంలో పోలీసులను ఒక ఆట ఆడుకున్నాడు. టైగర్‌ నాగేశ్వరరావు పేరు వినగానే కంగారు పడేంతలా ముప్పతిప్పలు పెట్టాడు. ఎందరికో అలా కడుపు నింపడం, చదువు చెప్పించడం వల్లే అతడిని ఇప్పటికీ ఆ ప్రాంతంలో గుర్తుచేసుకుంటారని చెప్తుంటారు. తెగింపు, ధైర్యం, దానం, నేర్పు, సాహసానికి టైగర్‌ నాగేశ్వరరావు సరైన ఉదాహరణ అని స్థానికులు చెప్తుంటారు.

పేరుకు దొంగ అయిన టైగర్‌ నాగేశ్వరరావు గురించి పోటీపడి బయోపిక్లు తీయడానికి అసలు కారణం అదే. ఒక సందర్భంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు అందరికీ దొంగగానే తెలుసు.. ఆయన గురించి తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వెలుగులోకి తెచ్చేందుకే ఈ సినిమా’ అంటూ డైరెక్టర్‌ వంశీ ప్రస్తావించాడు. మరి ఏ డైరెక్టర్‌ ఏ కోణంలో సినిమా తీస్తున్నారన్న విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. టైగర్‌ నాగేశ్వరరావుపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

#TigerNageswaraRao pic.twitter.com/jWUKmM5iEq

— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021

Wishing you all a very Happy Diwaliiii! 🙂 here’s the first look of my next #bss10 ! pic.twitter.com/30EXTHVCbH

— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) November 4, 2021

#bss10 #StuartpuramDonga pic.twitter.com/50Ns6deBwy

— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) November 5, 2021

Tags :

  • bellam konda
  • Biopic
  • Ravi Teja
  • Tiger Nageswara Rao
  • tollywood latest updates
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

  • నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

    నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • ఆ డైరెక్టర్లు నా డబ్బులు కొట్టేశారు.. నన్ను డ్రైవర్​గా వాడుకున్నారు

    ఆ డైరెక్టర్లు నా డబ్బులు కొట్టేశారు.. నన్ను డ్రైవర్​గా వాడుకున్నారు

  • విరాట్ కోహ్లీ బయోపిక్ పై మెగాహీరో రామ్ చరణ్ క్లారిటీ!

    విరాట్ కోహ్లీ బయోపిక్ పై మెగాహీరో రామ్ చరణ్ క్లారిటీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam