న్యాచురల్ స్టార్ నాని త్వరలో ‘దసరా’ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కొందరు డైరెక్టర్లు తన దగ్గర డబ్బులు కొట్టేశారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు..
సినీ పరిశ్రమలో స్టార్డమ్ తెచ్చుకోవడం అంత సులువు కాదు. వరుసగా విజయాలు అందుకుంటూ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాలి. అప్పుడు గానీ స్టార్ హీరో రేంజ్ రాదు. ఎలాంటి అండ లేకుండా ఈస్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ దీన్ని నిజం చేసి చూపించాడు నాని. తన సొంత ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ, స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. న్యాచురల్ యాక్టింగ్‌తో అదరగొడతారని కాబోలు ఆయన్ని అభిమానులు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
యూత్‌తో పాటు కుటంబ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాని. త్వరలో ‘దసరా’ చిత్రంతో ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా ఉన్నారు నాని. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో నాని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌తో పాటు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి ఆయన వెల్లడించారు. సినిమా అవకాశాల కోసం ఫొటో ఆల్బమ్స్ పట్టుకుని తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానన్నారు నాని. అయితే ఎక్కడా కనీసం తనను లోపలికి కూడా రానివ్వలేదన్నారు.
‘చిన్న చిన్న క్యారెక్టర్స్ చేద్దామని అనుకున్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్లా కూడా వాడుకున్నారు. నాతో రకరకాల పనులు చేయించుకున్నారు. ఆఖరుకు నా ఏటీఎంలో పండుగలకు బట్టలు కొనుక్కునేందుకు దాచిన డబ్బుల్ని కూడా కొట్టేశారు’ అని నాని చెప్పుకొచ్చారు. ఈ స్కాములన్నీ చూశాక మళ్లీ మోసపోవడం తన వల్ల కాదని నటుడిగా ప్రయత్నాలు ఆపేశానన్నారు నాని. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారానన్నారు. ఇక, ‘అష్టాచమ్మా’తో హీరోయిన్గా మారిన నాని.. ఆపై వరుస హిట్స్ కొడుతూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘దసరా’తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు.