టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ దీని గురించి మాట్లాడాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ పేరు వినగానే మొన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనేవారు. ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుందో.. అప్పటినుంచి చరణ్ పేరు మార్మోగిపోతోంది. కొడుకు ఎదుగుదల చూసి చిరంజీవి తెగ మురిసిపోతున్నారు. చరణ్ క్రేజ్ ఆ రేంజ్ లో పెరిగింది మరి. ఇలాంటి టైంలో రామ్ చరణ్.. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ప్లాన్ చేస్తున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. అందుకు తగ్గట్లే లైనప్ కూడా అదిరిపోయేలా సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా కోహ్లీ బయోపిక్ గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో బయోపిక్ అనేది ఎప్పటికీ మరుగున పడని ట్రెండ్. కరెక్ట్ గా తీయాలనే గానీ ‘ధోని’ సినిమాలా చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అద్భుతంగా నటించి అదరగొట్టేశాడు. కపిల్ దేవ్ బయోపిక్ ’83’లో రణ్ వీర్ సింగ్ నటించాడు. త్వరలో గంగూలీ బయోపిక్ రానుంది. అందులో రణ్ బీర్ కపూర్ హీరోగా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా దిగ్గజ క్రికెటర్ల జీవితాల్ని సినిమాలుగా తీశారు, తీస్తున్నారు. కోహ్లీ లైఫ్ ని చూసిన అభిమానులు చాలామంది, అతడి బయోపిక్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఆ టాపిక్ మరోసారి వచ్చింది.
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలుచుకున్న తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన చరణ్.. దిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కావడం, ఆస్కార్ గెలుచుకోవడం గురించి చెప్పాడు. అలానే తన తర్వాత చేయబోయే చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ బయోపిక్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. ‘ఛాన్స్ వస్తే తప్పకుండా విరాట్ కోహ్లీ బయోపిక్ లో యాక్ట్ చేస్తాను. చాలారోజుల నుంచి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ తీయాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నాడు. ఎవరైనా డైరెక్టర్స్.. స్టోరీతో చరణ్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాజెక్ట్ ఓకే కావడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. మరి కోహ్లీ బయోపిక్ లో చరణ్ చేస్తే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
” I would Like to Play anything do with Sport. I’ve been a long due Like something like a Sports based film.#ViratKohli inspires me a lot, if there is a chance to act in biopic of @imVkohli it will be fantastic “
~ @AlwaysRamCharan 🔥🔥#RamCharan pic.twitter.com/MVhHu02qSy
— Thyview (@Thyview) March 18, 2023