సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వకసేన్ చేసిన ప్రాంక్ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేసుకోబోతున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్‌లో(హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కష్టాల్లో హీరో విశ్వక్ సేన్! HRC లో ఫిర్యాదు!
ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్ హీరో విశ్వక్ సేన్, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది. దీనిలో భాగంగా విశ్వక్‌సేన్, యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం చోటు చేసుకోవడం.. ఈ క్రమంలో దేవి నాగవల్లి.. విశ్వక్‌సేన్‌ని గెట్ ఔట్ అనడం.. దాంతో విశ్వక్ సేన్ స్డూడియోలోనే బూతులతో విరుచుకపడ్డం జరిగింది. వీరిద్దమరి మధ్య చోటు చేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరలవయ్యింది. ఈ క్రమంలో ఈ సంఘటనపై నెటజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. విశ్వక్‌సేన్‌కు మద్దతివ్వడమే కాక.. దేవి నాగవల్లిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది జర్నలిజమా.. అని ఒకరు.. అది నీ స్టూడియోనా.. అని ఇంకొకరు.. నువ్ టీవీ9లో పని చేస్తున్నావ్.. అది నీ స్టూడియో కాదు అని మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ స్థానంలో ఓ పెద్ద హీరోనో, పెద్ద రాజకీయ నాయకుడో ఉంటే నువ్ ఇలానే మాట్లాడతావా.. అతడిని కూడా గెట్ ఔట్ అనగలవా అని ప్రశ్నిస్తున్నారు.
#BANAnchorDevi
😂🙏 pic.twitter.com/jh7tVHsW2A— Uday kiran (@Udaykir82590118) May 2, 2022
ఇది కూడా చదవండి: Vishwak Sen: ప్రముఖ యాంకర్ తో హీరో విశ్వక్ సేన్ గొడవ! స్టూడియోలోనే బూతులు!
అంతేకాక ‘‘ముందు నువ్వు అతడిని పాగల్ శీను, డిప్రెస్సెడ్ పర్సన్ అన్నావ్.. తనను అలా అనడానికి నీకేం అధికారం ఉందని’’ కొందరు నెటజనులు ప్రశ్నిస్తున్నారు. యాంకర్ దేవిని బ్యాన్ చేయాలని సోషల్‌మీడియాలో హ్యాష్ ట్యాంగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Is this called as Journalism?@TV9Telugu has to take a proper action on this frustrated anchor #BANAnchorDevi @VishwakSenActor pic.twitter.com/cFNKoc8hBB
— SRIKANTH PAGADALA (@SreekanthPagad5) May 2, 2022
#WeSupportVishwaksen#BANAnchorDevi
Chinna Hero unnadu TRP vasthdhi ani me pilla veshalu
Aa Place lo oka start hero kani rajakiya nayakudu kani unte ila chestharaa
Oka Vela chesina Me studio mrng ki untadhaa … @Devi_Nagavalli— Power Star⭐ NTR 🔥 (@Haripra34727992) May 2, 2022
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: ఇలాంటి మహిళను ఇప్పటిదాకా చూడలేదు: వర్మ