మహేశ్ బాబు ఫ్యాన్స్ మొత్తం సర్కారు వారి పాట మేనియాలో మునిగిపోయారు. మహేశ్- కీర్తి సురేశ్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ కు మహేశ్- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న చిత్రం గురించి మరో క్రేజీ అప్డేట్ రానే వచ్చింది.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ కావాలంటే..!
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి- మహేశ్ సినిమాకి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ కీలక విషయాలు వెల్లడించారు. ‘మహేశ్ బాబు ఈ సంవత్సరం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉంటారు. అందుకే మహేశ్‌తో రాజమౌళి సినిమా 2023 ప్రథమార్థంలో ప్రారంభం కానుంది. రాజమౌళితో సినిమాకి ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగుతుంది’ అంటూ కథ గురించి కూడా హింట్స్ ఇచ్చేశారు. ఇండియానా జోన్స్ తరహాలో కథ ఉండబోతోందంటూ ఇప్పటికే నెట్టింట లీకులు వస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కూడా అడవి నేపథ్యం అనగానే మహేశ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల రాజమౌళితో సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆయనతో పనిచేసేందుకు ఏంతో ఉత్సాహంతో ఉన్నానంటూ మహేశ్ కూడా కామెంట్ చేశాడు.
నిజానికి సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేశ్- రాజమౌళి సినిమా తెరకెక్కుతుందని మొదట ప్రచారాలు జరిగాయి. కానీ, ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ప్రస్తావనలోకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడాపూర్తయ్యాయి. అయితే రెగ్యులర్ షూట్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. జులై రెండో వారం నుంచి మహేశ్- త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా రానుడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళితో సినిమా ప్రారంభం కానుంది. మహేశ్ – రాజమౌళి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.