నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, యం.యం.కీరవాణి లు పలు సినిమా వేడుకలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మద్య కీరవాణి ‘మత్తు వదలరా’ మూవీ సక్సెస్ మీట్ కి వెళ్ళినప్పుడు.. ‘ఇక్కడ సక్సెస్ మీట్లు పెట్టారు అంటే సినిమా ప్లాప్’ అంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. తాజాగా ‘కార్తికేయ 2’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో ఈవెంట్ లపై తనదైన పద్దతిలో సంచలన కామెంట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..‘కార్తికేయ 2 ఈవెంట్ కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.. అయితే నాకు ఇలాంటి రిలీజ్ ఫంక్షన్లకు రావాలంటే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది.. ఎందుకంటే స్టేజ్ పై వాళ్ల ముఖాలు చూస్తే అప్పుడే తెలిసిపోతుంది.. ఆ సినిమా ఖచ్చితంగా పోతుందని.. కానీ తప్పని సరిపరిస్థితిలో సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పాలి. లేదంటే వారు ఎంతో బాధపడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చెప్పాల్సి వస్తుంది.
కానీ ‘కార్తికేయ2’ మూవీ విషయం మాత్రం వేరు.. ఈ మూవీ నిజంగా ఓ అద్భుతమైన విజయం సాధిస్తుంది.. ప్రొడ్యూసర్లు ఈ విషయం నోట్ చేసుకొని పెట్టుకోవాలని అన్నారు. అంతేకాదు.. ఈ మూవీ బాలీవుడ్ లో కూడా రికార్డు క్రియేట్ చేయడం పక్కా అన్నారు. ఈ మూవీ సౌత్ సినిమాల విజయపరంపరను కంటిన్యూ చేస్తుంది. ’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్, యువ నటులు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.