ఆమె తన తాజా చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారు. యంగ్ హీరోలు ఈమెతో సినిమా తీయటానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈమె తీసిన సినిమాల్లో సక్సెస్ సాధించినవే ఎక్కువగా ఉన్నాయి.
పై ఫోటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నది ఓ స్టార్ హీరోయిన్. ఆమె పుట్టింది కేరళలో అయినా.. తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. ఆమె తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పక్కన నటించేందుకు యంగ్ హీరోలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె ఉంగరాల జుట్టుకు సైతం ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పాటికే మీకు అర్థం అయి ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో అని.. అవును! పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదండి..
మన కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. అనుపమ 2016లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ ముద్దుగుమ్మ అఆ, సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింత చేరువయ్యారు. ఆ తర్వాత శర్వానంద్‌తో శతమానంభవతి.. రామ్‌తో ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐలవ్యూ, హలో గురు ప్రేమ కోసమే, రౌడీ బాయ్స్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు అనుపమ పరమేశ్వరన్. ఆమె తన తాజా చిత్రం కార్తీకేయ 2 సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయారు.
అదే సమయంలోనే బటర్ ప్లై, 18 పేజీస్ వంటి లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించిన పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆమె ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్యేర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు సైరన్, ఈగల్ వంటి క్రేజీ సినిమాలు అనుపమ చేతిలో ఉన్నాయి. మరి, అనుపమ పరమేశ్వరన్ చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.