‘కార్తికేయ 2’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ నేపథ్యంలోనే తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తన రెమ్యూనరేషన్‌ను పెంచేశారట.
‘కార్తికేయ 2’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం స్పై, స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఈ మూడు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు కావటం విశేషం. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘కార్తికేయ3’ కూడా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. కార్తికేయ 2 సినిమాకు ముందు వరకు నిఖిల్ ఓ ప్రాంతీయ భాషా నటుడు. కానీ, ఆ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
దేశ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. ఇలా దేశ వ్యాప్తంగా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. తన క్రేజ్‌కు తగ్గట్టుగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిఖిల్ తన ప్యాన్ ఇండియా స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని దాదాపు 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. అంతేకాదు! కొన్ని సినిమాల లాభాల్లో షేర్ కూడా అడుగుతున్నారట. నిఖిల్ అప్‌కమింగ్ మూవీ స్వయంభూ లాభాల్లో తనకు షేర్ కావాలని నిఖిల్ అడిగినట్టు సమాచారం.
కాగా, నిఖిల్ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయినుంచి స్టార్ హీరోగా ఎదిగారు. 2003లో వచ్చిన సంబరం మూవీలో చిన్న క్యారెక్టర్ చేశారు. అదే ఆయన మొదటి సినిమా. 2007లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఆయన దశ తిరిగింది. అందులో నిఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోగా వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. కెరీర్‌లో పదికి పైగా భారీ హిట్లను అందుకున్నారు. మరి, నిఖిల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.