తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ సిద్ధార్థ. అంతకు ముందు పలు యూట్యూబ్ ఛానల్స్ లో నటించాడు. హ్యాపీడేస్ తర్వాత కార్తికేయ, స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య ఇలా వరుస చిత్రాల్లో నటించి మంచి విజయం సాధించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న ‘స్పై’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘కార్తికేయ 2’ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. హిందీలో ఈ చిత్రం కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాల వారు కూడా షాక్ అయ్యారంటే అక్కడి ఆడియన్స్ మూవీకి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఆ పాన్ ఇండియా ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అందర్నీ అలరించే సినిమాలు లైనప్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నిఖిల్. ‘కార్తికేయ 2’ కథ శ్రీకృష్ణుడు చుట్టూ తిరగ్గా, ఇప్పుడు ‘స్పై’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకగల రహస్యాలను చూపించనున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ (1&2) సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఐశ్యర్వ మీనన్ హీరోయిన్. రాజ శేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. జూన్ 29న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది ‘స్పై’ టీమ్..
ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించడంతో పాటు ఉత్కంఠతకు గురి చేసే కథ, కథనాలతో ఆకట్టుకోబోతున్నారని హింట్ ఇచ్చింది ట్రైలర్. ‘చరిత్ర మనకెప్పుడూ నిజం చెప్పదు.. దాస్తుంది.. దానికి సమాధానం మనమే వెతకాలి’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు అంచనాలు పెంచింది. ట్రైలర్ ద్వారా క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. ట్రైలర్ చివర్లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ‘స్వతంత్ర్యం అంటే ఒకడిచ్చేది కాదు.. లాక్కునేది.. ఇది నేను చెప్పింది కాదు.. నేతాజీ చెప్పింది’ అంటూ రానా చెప్పిన మాటతో ట్రైలర్ ఎండ్ చేసిన విధానం బాగుంది. శాన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్, సచిన్ కేద్‌కర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్న ‘స్పై’ మూవీ మీద భారీ అంచనాలున్నాయి..