యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫిలిం ‘స్పై’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తోనూ డే 1 అదిరిపోయే వసూళ్లు రాబట్టింది.
‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫిలిం.. ‘స్పై’. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకగల రహస్యాలను చూపించనున్నట్లు ప్రోమోలతో హైప్ క్రియేట్ చేశారు టీం. ఈ మూవీతో ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ (1&2) సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఐశ్యర్వ మీనన్ హీరోయిన్. రాజ శేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన ‘స్పై’ అందుకు తగ్గట్టుగానే భారీస్థాయిలో బిజినెస్ జరుపుకుంది. నిఖిల్ కెరీర్లో హయ్యస్ట్ బిజినెస్ అలాగే ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి థియేట్రికల్ రిలీజ్ వరకు ఇదే ఎక్కువ. జూన్ 29న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘స్పై’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ.1.72 కోట్లు
సీడెడ్ – రూ.56 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ.54 లక్షలు
ఈస్ట్ – రూ.33 లక్షలు
వెస్ట్ – రూ.22 లక్షలు
గుంటూరు – రూ.48 లక్షలు
కృష్ణా – రూ.25 లక్షలు
నెల్లూరు – రూ.18 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.28 కోట్ల షేర్, 6.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.46 లక్షలు, ఓవర్సీస్లో రూ.1.28 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ షేర్ : రూ. 6.02 కోట్లు. గ్రాస్ : రూ.10.45 కోట్లు. అయితే తమ సినిమా తొలిరోజు రూ.11.7 కోట్లు కలెక్ట్ చేసిందని ఓ అఫీషియల్ పోస్టర్ షేర్ చేశాడు నిఖిల్. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగడంతో మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది.
‘కార్తికేయ 2’ తర్వాత వస్తున్న పాన్ ఇండియా ఫిలిం కావడంతో ప్రేక్షకాభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ‘కార్తికేయ 2’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్లు సాధించగా, ‘స్పై’ మరో 3 కోట్లు అదనంగా.. రూ.11.7 కోట్లు రాబట్టింది. రొటీన్ రెగ్యులర్ కథతో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ. 12.80 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.13.50 కోట్లు. ఈ లెక్కన ఇంకా రూ.7.50 కోట్ల షేర్ రావాలి. మరి సినిమాల వసూళ్లలో కీలకపాత్ర పోషించే శుక్ర, శని, ఆది వారాల్లో ‘స్పై’ ఎంత మేరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.