‘రాక్షసుడు’ కంటే మరింత ఉత్కంఠభరితమైన కథతో రూపుదిద్దుకోనున్న ‘రాక్షసుడు-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీర్చుదిద్దుతున్నారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా., కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను హాలీవుడ్ స్థాయిలో జత చేస్తున్నారు, ఈ మూవీకి సీక్వెల్‌లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఓ టాప్ నటుడ్ని ఇందులో హీరోగా చూపించనున్నారు. బాలీవుడ్ హీరోతో పాటు తమిళ సంచలన నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారని బోగట్టా. తెలుగు హీరో హవీష్ ఓ పాత్ర పోషించే అవకాశం వుంది.
గతంలో సినిమాకి 50 కోట్లు అంటే భారీ బడ్జెట్ అనుకుని ఖర్చుకు కాస్త ఆలోచించే నిర్మాతలు, బాహుబలి చిత్రం బాక్స్‌ఫీస్ ఫలితాలు వాళ్ల లెక్కలన్నీ మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా కథ డిమాండ్ చేస్తే భారీగానే ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనకాడడం లేదు. ఆ విధంగా అటు నార్త్, ఇటు సౌత్ కవర్ చేసేసారు. మంచి ముహర్తం చూసి ఆ బాలీవుడ్ నటుడి పేరు రివీల్ చేస్తారని తెలుస్తోంది. తెలుగు హీరో హవీష్ కూడా ఓ పాత్ర పోషించే అవకాశం వుంది.
కోనేరు సత్యనారాయణ నిర్మించే ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. ప్రస్తుతం ఈ నిర్మాత, ఈ డైరక్టర్ కలిసి రవితేజ తో ఖిలాడీ సినిమా చేస్తున్నారు. దాని తరువాత ఈ సినిమా వుంటుంది. అలాగే, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ లండన్‌లో ప్రారంభం కానుంది. ఎ. హవీశ్ ప్రొడెక్షన్‌లో నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి కూడా రమేశ్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు రమేశ్ ప్రస్తుతం రవితేజతో ‘ఖిలాడీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.