సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఇటీవల కాలంలో రెగ్యులర్ గా జరుగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నార్మల్ హిట్టైనా.. బిగ్ హిట్టైనా.. వెంటనే ఆయా సినిమాలకు కొనసాగింపు ఉందంటూ.. సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎప్పటినుండో జరుగుతున్నప్పటికీ, ఇండియన్ సినిమాలలో ఈ మధ్యే సీక్వెల్స్ హవా మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషలలో సీక్వెల్ పార్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కాకుండా.. వాటికి రెట్టింపు సంఖ్యలో సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి.
మొదటి సినిమా హిట్ అయ్యిందని.. సెకండ్ ప్లాన్ చేస్తే కొన్నిసార్లు వర్కౌట్ అయినా మాక్సిమమ్ బోల్తాకొట్టే అవకాశము ఉంటుంది. ఎందుకంటే.. మొదటి పార్ట్ కి ముందే సీక్వెల్ ఉంటుందని ప్లాన్ చేయడం వేరు. మొదటి సినిమా హిట్ అయ్యాక సీక్వెల్ ప్లాన్ చేయడం వేరు. ఈ రెండు విషయాలు సీక్వెల్ విషయంలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. టాలీవుడ్ లో కార్తికేయ 2, డీజే టిల్లు, బింబిసార సీక్వెల్స్ తర్వాత మరో క్రేజీ మూవీకి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా ఫస్ట్ టైమ్ జతకట్టిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘గీతగోవిందం’. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాని జిఏ2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.
అర్జున్ రెడ్డి లాంటి పెద్ద హిట్ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకొని అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రూ. 100 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. ముఖ్యంగా స్టోరీతో పాటు సాంగ్స్, విజయ్ – రష్మిక కెమిస్ట్రీ, కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అయితే.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. సర్కారు వారి పాట మూవీ తర్వాత పరశురామ్ నెక్స్ట్ సినిమాని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో.. ప్రెజెంట్ ‘గీతగోవిందం 2’ స్క్రిప్ట్ పనిలో బిజీ అయ్యాడని.. ఆల్రెడీ బన్నీ వాసు, విజయ్ లతో సంప్రదింపులు కూడా జరిగాయని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఓవైపు విజయ్, రష్మిక వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సో.. ఇప్పుడీ సీక్వెల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో! ఇక గీతగోవిందం మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#geethagovindam 2 అండర్ ప్లానింగ్..చర్చలు సాగుతున్నాయి
..@TheDeverakonda @ParasuramPetla @Ga2Pictures— devipriya (@sairaaj44) February 1, 2023