విరూపాక్ష సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి బ్లాక్ బాస్టర్ సాధించిన ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా.. సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొత్త దర్శకుడు కార్తిక్ దండు.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులు మనసు గెలిచాడు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. మరి సూపర్ హిట్ సాధించిన విరూపాక్ష సినిమాకు సీక్వెల్ ఉందా.. లేదా.. అనే దానిపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో విరూపాక్ష సీక్వెల్ ఉంటుందా లేదా అన్న దానిపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఇంతకు సుప్రీం హీరో ఏమన్నాడంటే.
‘విరూపాక్ష’ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో.. ఫుల్ ఖుషీలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలో ఆయన నెటిజనులతో ముచ్చటించారు. #AskSDT పేరుతో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సాయి ధరమ్ తేజ్. అభిమానులు అడగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పాడు అభిమాని. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ఇంతకు “విరూపాక్ష మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు కదా.. మరి ఈ సినిమా పార్ట్-2 ఉంటుందా.. సాయి ధరమ్ తేజ్ అన్న. ఒకవేళ పార్ట్ 2 ఉంటే మన ఫ్యాన్స్ కి పండుగే” అని ట్వీట్ చేశాడు. అందుకు సాయి ధరమ్ తేజ్ సమాధానం ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ ఉంటుంది అని క్లైమాక్స్‌లో చిన్న హింట్ ఇచ్చాం కదా అని చెప్పుకొచ్చాడు. దాంతో విరూపాక్ష సినిమా సీక్వెల్ ఉంటుందని కన్ఫామ్ కావడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ‘విరూపాక్ష’ సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ దండు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఓ చానెల్ ఇంటర్వ్యూలో ప్రేక్షకుడు.. విరూపాక్ష సీక్వెల్ ఉంటుందా అని అడిగాడు. అందుకు కార్తీక్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటి వరకైతే… సీక్వెల్ గురించి నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా విరూపాక్ష సీక్వెల్ ఉంటుంది. కాకపోతే వెంటనే రాకపోవచ్చు’’ అన్నాడు. అయితే, ఈ మూవీలో ఉన్న రెండు పాటల్లో కేవలం ఒక పాట మాత్రమే థియేటర్లో ఉందని, రెండోది లేదు ఏంటని ప్రేక్షకులు ప్రశ్నించగా.. విరూపాక్ష ఓటీటీలో విడుదల అయినప్పుడు ఆ పాట ఉంటుందని తెలిపాడు. థియేటర్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు ఆ థ్రిల్ మిస్సవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పాటను తొలగించినట్లు దర్శకుడు కార్తీక్ దండు వెల్లడించాడు.
విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ కావడంతో విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై భారీ అంచానలు నెలకొన్నాయి. అంతేకాక సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా అతడికి ప్లస్ అయ్యింది. సినిమా బావుందని నెటిజనులు మాత్రమే కాక.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. మరి విరూపాక్ష సినిమా సీక్వెల్ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Virupaksha Movie Climax Lo Chinna Hint Icharu Part2 Untundha @IamSaiDharamTej Anna Okavela Part2 Unte Mana Fan’s Ki Panduge Anna#AskSDT #BlockBusterVirupaksha pic.twitter.com/yvDJsxxnej
— Pavan Kalyan Mbs (@MbsPavanJsp) April 24, 2023