పవన్ తో మరోసారి కలిసి పనిచేయడానికి 'వకీల్ సాబ్' డైరెక్టర్ రెడీ అయిపోయాడు. అందుకు సంబంధించిన హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి డైరెక్టర్ అనుకుంటూ ఉంటాడు. కానీ అది కొందరికే సాధ్యమవుతూ ఉంటుంది. అలా పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ని డైరెక్ట్ చేసే అవకాశం వేణు శ్రీరామ్ కు వచ్చింది. తీస్తున్న రీమేక్ అయినప్పటికీ.. పవన్ ఇమేజ్ కు తగ్గట్లు చేర్పులు, మార్పులు చేసి ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్స్ రాసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేశాడు. ఇతడి మాటలు విని, ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. గతేడాది ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకుల్ని అలరించారు. అప్పటి నుంచి వరస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. లైనప్ లో ‘హరిహర వీరమల్లు’, ‘PKSDT’, ‘OG’.. ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో ‘వినోదయ సీతం’ రీమేక్ అదేనండి.. PKSDT వర్కింగ్ టైటిల్ తో తీస్తున్న సినిమానే ముందు థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తుంది. మిగతావి ఎప్పుడొస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. అలానే పవన్ తో సినిమా చేయడానికి పలువురు డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి వేణు శ్రీరామ్ కూడా చేరారా అనిపిస్తుంది.
తాజాగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో మాట్లాడిన డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ‘ఐకాన్ ఆగిపోయింది. ఆ తర్వాత వేరే సినిమా ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతానికైతే ఓ మూడు స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాను. అందులో ‘వకీల్ సాబ్’ సీక్వెల్ కూడా ఉంది. తొలి పార్ట్ లో కంటే ఈసారి ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే చాలా సీన్స్ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. తాజా పరిస్థితి చూస్తుంటే.. పవన్ ఈ సీక్వెల్ చేస్తారా అనే సందేహమే. ఎందుకంటే పవర్ స్టార్ ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు. ఒకవేళ పవన్ కు కుదరకపోతే.. వేణు మరో హీరోతో ఈ సినిమా చేస్తారా? లేదా పవన్ కోసం ఎదురుచూస్తారా అనేది చూడాలి. మరి ‘వకీల్ సాబ్ 2’లో ఎలాంటి స్టోరీ ఉండబోతుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#VakeelSaab2 script is in progress…#VakeelSaab rerelease next year…
Thank you MASS GOD🔥🔥#2YearsOfBBVakeelSaab pic.twitter.com/5UYN6YtTbn
— Sainadh (@rocksainadh25) April 9, 2023