‘కాంతార’.. ఈ సినిమా గురించి ఏం చెప్పుకొన్నా, ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే జస్ట్ రూ.15 కోట్లతో ఈ మూవీ తీస్తే.. ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఓన్లీ కన్నడ వరకు మాత్రమే రిలీజ్ అనుకున్న ఈ చిత్రం కాస్త.. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు, ఫేమ్ సంపాదించింది. ఈ ఏడాది సక్సెస్ పరంగా అద్భుతాలు చేసిన పాన్ ఇండియా మూవీస్ లో ఇది ఓ రకంగా టాప్ లో నిలిచింది. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రమోషన్స్ లో భాగంగా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు పనులు కూడా మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కాంతార’ సినిమా ప్రేక్షకుల మనసు వందకు వంద శాతం గెలుచుకుంది. ఈ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేసిన చిత్రబృందం.. ప్రస్తుతం సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగానే చిత్రయూనిట్ అంతా కలిసి కర్ణాటక మంగళూరు శివారులోని కద్రి మంజునాథేశ్వర ఆలయాన్ని దర్శించారు. అక్కడే జరిగిన భూతకోలకు హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ సప్తమి గౌడ, నిర్మాత విజయ్ కిర్గందూర్ తదితరులు హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ ఆడిగ సమక్షంలో ‘కాంతార’ సీక్వెల్ నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పంజుర్లి దైవం నుంచి సంపూర్ణ ఆశీస్సులు లభించినట్లు తెలుస్తోంది.
అయితే సీక్వెల్ ప్రారంభించడానికి ముందు కొన్ని నియమాలు పాటించాలని హీరో రిషబ్ శెట్టికి పంజుర్లి దైవం హెచ్చరించినట్లు తెలుస్తోంది. తొలి భాగం తీసినట్లే ఎంతో నియమ నిష్ఠలతో రెండో భాగాన్ని కూడా తీయాలని పంజుర్లి సూచించినట్లు తెలుస్తోంది. ‘కాంతార’ చిత్రాన్ని తీసేముందు 10 సార్లు ఆలోచించావని, అయినా సరే కొన్ని తప్పులు చేశావని రిషబ్ తో పంజుర్లి అన్నట్లు తెలుస్తోంది. ఈ తప్పులు క్షమించానని, కానీ ‘కాంతార’ సీక్వెల్ కు ముందు మాత్రం 100 సార్లు ఆలోచించమని పంజుర్లి ఆదేశించినట్లు సమాచారం. సీక్వెల్ కు కూడా ఇదే బృందంతో వెళ్లాలని, ఎలాంటి నియమాలు పాటించాలో వీరికి తెలుసు కాబట్టి వీరినే కొనసాగించాలని పంజుర్లి దైవం.. రిషబ్ కు సూచించినట్లు సమాచారం. స్వచ్ఛమైన మనసుతో తీస్తే.. విజయానికి తాను భరోసా ఇస్తున్నానని పంజుర్లి, రిషబ్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించనున్నారు. ఒకవేళ కుదిరితే వచ్చే ఏడాది లేదంటే 2024లో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.