టాలీవుడ్ యంగ్ ఆండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై కాస్త క్లారిటీ ఇచ్చాడు. తన సోదరుడు ఆనంద్ హీరోగా దామోదర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం పుష్పక విమానం. త్వరలో ఈ మూవీ ప్రేక్షలకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్నదమ్ములు ఆనంద్, విజయ్ దేవరకొండ కలిసి స్పెషల్ చిట్ చాట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు విజయ్.
ఇక వీరిద్దరి చిట్ చాట్ లో భాగంగా పెళ్లి ప్రస్తావన, తదితర విషయాలపై ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే విజయ్ మాట్లాడుతూ.. ముందుగా పెళ్లి కూడా తన తమ్ముడు ఆనంద్ దే జరుగుతుందని తెలిపటంతో ఆనంద్ లేదు అనేట్లుగా సైగలు చేశాడు. ఇక అమ్మ ఫేవరెట్ ఎవరు అనే ప్రశ్నకు నేనంటూ నేను అనే విధంగా ఇద్దరు సమధానాలిచ్చారు. ఇలా ఎంతో ఫన్నీగా సాగిన వీరి ఇంటర్వ్యూ చూడాలంటే పూర్తి వీడియో వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.