తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు – తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశాడు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు – రామారావు ఆన్ డ్యూటీ చిత్రం లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.
ఎన్నో సినిమాల్లో తనదైన మార్క్ కామెడీ, సెంటిమెంట్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఆరడుగుల పొడగు ఉన్నప్పటికీ తన బాడీ ఇమేజ్‌కి తగినట్లుగా పాత్రలను ఎంపిక చేసుకుని హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా.. ఇలా సుమారు 26 సినిమాల్లో నటించారు. తొట్టెంపూడి వేణు కెరీర్లో ఎక్కువ శాతం హిట్లే.
2006 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న వేణు 2012లో ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘దమ్ము’ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ‘రామాచారి’ అనే సినిమా చేయగా అది పరాజయం పాలైంది. ఈలోగా వ్యాపార కార్యకలాపాల్లో తలమునకలు కావడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.
‘వెల్కమ్ ఎ బోర్డ్ వేణు’ అంటూ రామారావు ఆన్ డ్యూటీ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.’గోపి గోపిక గోదావరి’ సినిమా అనంతరం సినిమాలకు దూరమైన వేణు 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు.
సో … వేణు తొట్టెంపూడికి గ్రాండ్ గా వెల్కం చెప్తోంది సుమన్ టీవీ.