చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీల వరుస మరణవార్తలతో కృంగిపోయి ఉన్న మరో సెలబ్రిటీ దూరమైన వార్త కుదిపేస్తోంది. వెన్నిల కబడ్డీ టీమ్(తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పాపులర్ యాక్టర్ హరి వైరవన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరి వైరావన్.. చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకి తెలిపారు. పలు సూపర్ హిట్ తమిళ సినిమాలలో నటించిన హరి వైరవన్ మరణవార్తతో కోలీవుడ్ వర్గాలలో విషాదం నెలకొంది.
స్టార్ డైరెక్టర్ సుశీంద్రన్ తెరకెక్కించిన వెన్నిల కబడ్డీ టీమ్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు హరి. ముఖ్యంగా పరోటా షాప్ లో సీన్ తో హరికి వరుస సినీ అవకాశాలు తలుపుతట్టాయి. అలా మరోసారి సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా పేరు శివ’ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు. నటుడిగా హరి వైరవన్ దాదాపు తాను నటించిన అన్ని సినిమాలలోనూ కమెడియన్ క్యారెక్టర్స్ లోనే మెరిశాడు. మధురైలో నివాసం ఉంటున్న ఆయన.. కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగోలేక పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు.
హరి వైరవన్ దాదాపు 11 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అప్పటికే అతని ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా కూడా ఏమి లేదని.. ఆఖరికి హరి వైరవన్ చికిత్సకి కూడా డబ్బులు లేక చనిపోయారని కోలీవుడ్ మాట్లాడుకుంటోంది. హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేక నటుడు హరి చనిపోయాడనే వార్త సినీ ప్రేక్షకులకు కలచివేస్తోంది. అంతేగాక హరి వైద్యం ఖర్చులకు సినీ ఇండస్ట్రీ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని టాక్. కాగా, శనివారం(డిసెంబర్ 3న) సాయంత్రం 5 గంటలకు హరి వైరవన్ అంత్యక్రియలు మదురైలోని కట్చనేండల్ లో జరగనున్నాయట. ప్రస్తుతం హరి వైరవన్ మృతి పట్ల హీరో విష్ణు విశాల్ తో పాటు సెలబ్రిటీలు, కోలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Vennila kabadi kulu fame actor #Harivairavan died due to health issue
RIP🙏 pic.twitter.com/pdcESjFN1W
— RAJA DK (@rajaduraikannan) December 3, 2022
We are Miss you 😭 Rest In Peace #HariVairavan Anna https://t.co/R6wxwwgdYQ
— MR (@MR61894176) December 3, 2022
நடிகர் ‘ஹரி வைரவன்’ உயிரிழப்பு
வெண்ணிலா கபடி குழு திரைப்படப் புகழ் நடிகர் ‘ஹரி வைரவன்’ உடல்நலக் குறைவால் உயிரிழந்தார்
அவரது சொந்த ஊரான மதுரை மாவட்டம் கடச்ச நேந்தலில் இன்று இறுதிச் சடங்கு நடைபெறுகிறது#vennilakabbadikuzhu #harivairavan #ThanthiTV pic.twitter.com/iFNfyRihPb
— Thanthi TV (@ThanthiTV) December 3, 2022