టాలీవుడ్లో కుర్రహీరోల కంటే కూడా స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు కథ విని లైన్లో పెట్టేలోపే.. వారు రెండో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు వెంకటేష్ కూడా చేరిపోయాడు. కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను లైన్లో పెటేయడంతో పాటు అంతే వేగంగా సినిమాలకు కంప్లీట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్‌ను ఇప్పటికే ‘నారప్పగా రీమేక్ చేశాడు వెంకటేష్. ఇందులో వెంకటేశ్ లుక్ చూసే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. ఇక మలయాళంలో హిట్ కొట్టిన ‘దృశ్యం 2’ సినిమాను ఇటీవలే పూర్తి చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడం అని అంతా ఫిక్సయిపోయారు. ఇవి అలా ఉండగానే.. ఎఫ్ 3 ని కూడా అల్రెడీ సెట్స్‌పైన పెట్టేశారు. ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ఈ సినిమా పంచుతుందని డైరెక్టర్ చెప్తున్నాడు. ఇలా ఫుల్ స్వింగ్ లో ఉన్న వెంకీ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్లో ఓ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మరో ప్రాజెక్టుకు ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. బైలింగ్వుల్ ప్రాజెక్టుగా ఇది రానుందని.. ఇందులో కోలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో కనిపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం లైన్మాత్రమే వెంకీ విన్నాడని.. పూర్తి కథ విన్నాకే ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తానని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు… వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ కోలీవుడ్ హీరో ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 రీమేక్, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేశ్.. మరో మూవీ చేయాలని కమిట్ కావడం నిజంగా మంచి విషయమే. ఇందుకే అంటారు ఎంతైనా సీనియర్ హీరోలు సీనియర్ హీరోలే అని.