నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయన కూడా అలాంటి సినిమాలే చేస్తుంటారు. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటారు. 2021 డిసెంబరులో ‘అఖండ’గా వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య.. దాదాపు ఏడాది తర్వాత ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎలాంటి రచ్చ చేయాలా అని ఆల్రెడీ ఫ్యాన్స్ ప్లాన్స్ వేసేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో సినిమా సెన్సార్ రివ్యూ.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత పెంచేలా చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య ఎవరితో సినిమా చేసినా సరే మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్ మినిమం ఉండేలా చూస్తారు. ఇక ఓ అభిమాని బాలయ్యతో మూవీ చేస్తే ఎలా ఉండబోతుందనేది ‘వీరసింహారెడ్డి’లో చూడబోతున్నాం. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయాన్ని చెప్పాడు. థియేటర్లలో మాస్ జాతర జరగబోతుందని అన్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్.. అందులో బాలయ్య డైలాగ్స్, డ్యాన్సులు చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని క్లారిటీ వచ్చేసింది. దానికి తగ్గట్లే తాజాగా సెన్సార్ జరగ్గా.. వాళ్లు కూడా సినిమా ఎలా ఉందో చెప్పేశారు.
ఇక సెన్సార్ టాక్ బట్టి.. సినిమా పాజిటివ్ గా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కు థియేటర్ లో కూర్చున్న ఆడియెన్స్, అభిమానులకు పూనకాలు రావడం గ్యారంటీ అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ అయితే ఒక్కరు కూడా సీట్లో కూర్చోరని చెబుతున్నారు. బాలయ్య డైలాగ్స్ కి అయితే అరిచి అరిచి గొంతులు పోతాయని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇలా సెన్సార్ సభ్యులే ‘వీరసింహారెడ్డి’ వీర లెవల్ అని అల్టిమేటం ఇచ్చేస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ‘వీరసింహారెడ్డి’ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
It’s U/A for #VeeraSimhaReddy💥💥
All set to Roar in Theatres from Jan 12 🔥🔥🔥#VeeraSimhaReddyOnJan12th
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @ramjowrites @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/6OnXQvYcTR
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2023