సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ షో చేయడమనేది మామూలే. కొందరు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎటువంటి షో చేయకపోయినా, ఇంకొందరు గ్లామర్ తో తెగ హడావిడి చేస్తుంటారు. అయితే.. ఫోటోషూట్స్, సినిమాలో కథ డిమాండ్ పరంగా అందాలను షో చేయడం ఓకే.. కానీ, అవకాశాల కోసమే ఈ గ్లామర్ షో అంతా! అంటే మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇండస్ట్రీలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా మరో గ్లామరస్ బ్యూటీ వాణి భోజన్ గ్లామర్ షోపై ఆసక్తికర కామెంట్స్ చేసిందని తమిళ సినీవర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగిన వాణి.. తెలుగులో సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే.. కెరీర్ ప్రారంభం నుండి కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన వాణి.. అడపాదడపా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. తాజాగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సిరీస్ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
ఇక ప్రముఖ ఓటిటి ‘సోనీ లివ్’లో ఆగష్టు 19 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ కి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వాణి.. తన కెరీర్ తో పాటు సినిమాలకు సంబంధించి కామెంట్స్ చేసింది. సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వాణి గ్లామర్ షోతో, బోల్డ్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినీ అవకాశాల కోసం గ్లామర్ షో చేయడానికి రెడీ అయినట్లున్నారు? అని యాంకర్ అడిగారు. దీంతో స్పందించిన వాణి.. “అవును.. అందులో తప్పేముంది” అంటూ చెప్పింది.
ఇంకా మాట్లాడుతూ.. “అయినా ఈ మధ్య చీర కట్టినా గ్లామరస్ గా ఉన్నావని అంటున్నారు. నాకు తెలిసి కాలానికి తగ్గట్టు ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది. ఇక ప్రేమ విషయానికి వస్తే.. పదహారేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను. కానీ, అది ఎక్కువకాలం నిలబడలేదు. వెంటనే బ్రేకప్ కూడా అయిపోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ‘తమిళ్ రాకర్స్’లో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. మరి గ్లామర్ షో పై వాణి చేసిన కామెంట్స్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.