బుల్లితెర, వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లుగా రాణిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. టిక్ టాక్, స్పాప్ చాట్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సెలబిట్రీ స్టేటస్‌ను పొందారు. అలా ఫేమస్ అయిన వారిలో ఒకరు వైష్ణవి చైతన్య.
బుల్లితెర, వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లుగా రాణిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. టిక్ టాక్, స్పాప్ చాట్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సెలబిట్రీ స్టేటస్‌ను పొందారు. అలా ఫేమస్ అయిన వారిలో ఒకరు వైష్ణవి చైతన్య. టిక్ టాక్ ద్వారా పేరు తెచ్చుకుని ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేశారు. వెబ్ సిరీస్‌లో నటించడం మొదలు పెట్టారు. మరో యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ఆమెకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సమయంలోనే ఆమె పలు సినిమాలు కూడా చేసింది. అలా వైకుంఠపురంలో, వరుడు కావలెను, టక్ జగదీష్, వాలిమై వంటి చిత్రాల్లో చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు హీరోయిన్‌గా అలరించేందుకు సిద్ధమౌతుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలుగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. హృదయ కాలేయం ఫేం సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది వైష్ణవి. ఈ నెల 14 నుండి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘బేబీ సినిమా చూశాక.. బయటకు వచ్చాక మిమ్మల్ని మీరు కనక్ట్ చేసుకుంటారు. అలా రియల్ లైఫ్ స్టోరీస్ ఇందులో కనిపిస్తాయి’అంటూ పేర్కొన్నారు. ‘యూట్యూబ్‌లో నటిస్తూ..సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటున్న నాకు..సడెన్ గా ఓ రోజు బేబీ అనే సినిమా అవకాశం నా లైఫ్ లోకి వచ్చింది. నాపై నాకు నమ్మకం లేని పరిస్థితులో ఉన్నప్పుడు. నేను చేయగలను అని నమ్మింది దర్శకుడు రాజేశ్’అని తెలిపారు.
‘సినిమాలోకి వచ్చింది మెయిన్ లీడ్(హీరోయిన్) అవుదామని వచ్చాను. కానీ యూట్యూబ్, ఇన్ఫ్లుయన్సర్, చాలా క్యారెక్టర్లు చేసినా. బేబీ సినిమా నా దగ్గరకు వచ్చినప్పుడు భయపడ్డా. అప్పుడు రాజేశ్ .. భయ పడాల్సిన అవసరం లేదు. బేబీ క్యారెక్టర్ నీలో కనిపించింది. నీలో ఆ కాలిబర్ ఉంది. ఆ భయాన్ని విడిచిపెట్టేయ్ అని చెప్పి స్టోరీ చెప్పాడు. ఎక్కడ నుండి ఏం చేస్తున్నా అని ఆలోచన లేదు. ఒక్క అవకాశం దొరికింది ఇన్నిఏళ్ల తర్వాత హీరోయిన్ గా అవకాశం రాగానే ఏం చేయాలో,ఎట్లా చేయాలే అని మాత్రమే ఆలోచించా. అలాగే నేను చాలా అవమానాలు పడ్డాను. ఈ పిల్ల యూట్యూబ్, ఇన్ఫ్లుయన్సర్, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టు.. మెయిన్ లీడ్ వచ్చింది ఏం చేస్తుంది అని తీసి పారేసిన రోజులున్నాయి. చేయదు ఆమె వల్ల కాదు అని మాటలు పడ్డ రోజులున్నాయి. అయితే ఏం చేస్తుందో నువ్వు చూపించాలి. నీకు సపోర్ట్ చేస్తా అన్నారు. థాంక్యూ సార్. మా అమ్మనాన్న ఫస్ట్ లైఫ్ ఇస్తే.. సెకండ్ లైఫ్ ఇచ్చింది మీరు సార్’అంటూ దర్శకుడినుద్దేశించి భావోద్వేగానికి అయ్యారు.
‘ఈ రోజు నేను డిఫరెంట్ లైఫ్ చూస్తున్నా అంటే మీ వల్లే. ఎట్లుంటది అనే మీమాంసలో ఉన్నప్పుడు, ఇంత ఆదరణ చూస్తున్నానంటే మీ వల్లే. ఈ మూడేళ్లలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. మీరుండి ఫుష్ చేశారు. థ్యాంక్యూ సోమచ్ సార్’అంటూ కంటతడి పెట్టుకున్నారు. ‘ఎన్ని నెగిటివ్స్ ప్రెజర్స్ వచ్చినా..నన్ను నమ్మి, నన్ను పుష్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే నన్ను బేబీ గా పెట్టుకున్నారు. ఇదంతా నేను చూడగలగుతున్నాననంటే ఇదంతా మీవల్లే థ్యాంకు సార్’అంటూ నిర్మాత ఎస్‌కెఎన్ ను ఉద్దేశించి కన్నీటి పర్యంతమైంది. చిన్న క్యారెక్టర్‌లో కనిపిస్తే మొత్తం అందరినీ సినిమాకు తీసుకెళ్లేదాన్ని.. అట్లాంటిది ఈ సినిమా మొత్తం నేనే ఉన్నా. ఈ జర్నీలో ఏం ఏం చేశానో గుర్తులేదు.’అని ఎమోషనల్ అయ్యారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘బేబీ’ ఓ మాస్ సినిమా అని చెప్పుకొచ్చారు.