ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు రాజకీయం ప్రముఖుల కాకుండా ఇటు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన నటుడు ఉత్తేజ్, ప్రకాశ్ రాజ్ స్పందించారు. ముందుగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. సిరివెన్నెల మరణంపై నాకు మాటలు రావడం లేదని ఆయన అన్నారు. ఆయన బతికున్నప్పుడు మేము కూడా బతికున్నామనేదే మా అదృష్టమంటూ ప్రకాష్ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాటలు కానీ పాటలు కానీ అవగాహనతో చైతన్యాన్ని అందించారని తెలిపారు. ఆయన రాసిన పాట ఆయనదే, జగమంత కుటుంబం ఆయనదే, ఏకాకి జీవితం ఆయనేదంటూ ప్రకాష్ రాజ్ అన్నారు.
ఇక ఆ తర్వాత నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ఒక సాహిత్య శఖం ముగిసిందని సిరివెన్నెల సీతారామశాస్త్రితో 25 ఏళ్ల ప్రయాణముందని నటుడు ఉత్తేజ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఉదయించే సూర్యూడిలా ఎప్పుడు రాస్తూనే ఉంటారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నామంటూ తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. ఒక బాపు, ముళ్లపుడి వెంకటరమణ, ఒక వేటూరి, బాలసుబ్రహ్మణం, సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఇలా అందరూ చనిపోతూ ఉంటే రేపటి రోజుల్లో తెలుగుని వెతకాల్సిన పరిస్థితులు వస్తాయోమోనని నటుడు ఉత్తేజ్ అన్నారు. ఆయన ఏ రంగం గురుంచి పాట రాసిన లోతుల్లోకి వెళ్లి పాట రాస్తారని అలాంటి శాస్త్రి లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఉత్తేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.