అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు శిరీష్. వెన్నెల కిశోర్, సునీల్, పోసాని కృష్ణ మురళి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్సపై ధీరజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో టాక్ బాగానే తెచుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమా నిరాశ పరిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా థియేటర్లలో అలరిస్తున్న ఈ మూవీపై తాజాగా ఓ వార్త బయటకి వచ్చింది. త్వరలో చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
సినిమా రిలీజ్ అయిన తేదీకి, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే తేదీకి కనీసం నెల రోజులైనా ఉండాలని నిర్మాతలు భావిస్తుంటే.. మరోపక్క ఓటీటీ వేదికలు నెల తిరక్కుండానే సినిమాలను స్ట్రీమింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలో వచ్చే మూవీల కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కాంతార మూవీ ఓటీటీలో రిలీజై.. అక్కడ కూడా ప్రేక్షకులను అలరించింది. తాజాగా అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం కూడా ఓటీటీలో సందడి చేయనుంది. మూడేళ్ల విరామం తరువాత అల్లు శిరిష్ మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. అనుతో శిరీష్ మంచి రొమాన్స్ పడించాడు. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాక నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కేసారి రెండు ఓటీటీ సంస్థలు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా మిగిలిన వాటి మాదిరిగానే నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 9న ఓటీటీలో విడుల కానుంది. ఊర్వశివో రాక్షసివో సినిమాను తమిళ సినిమా అయినా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆధారంగా రూపొందిచారు. ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమ కథా చిత్రమిది. లివింగ్‌రిలేషన్స్, పెళ్లి పట్ల యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు.