సింగర్ రమణ ఒకే ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయాడు. ఇక జబర్దస్త్ భానుపై పాడిన పాటతో వార్తల్లో నిలిచిన రమణ.. మరోసారి భానుపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక్కరాత్రిలోనే సోషల్ మీడియా స్టార్లుగా మారిపోతున్నారు కొందరు. ఈక్రమంలోనే ఒక్కపాటతో రెండు రాష్ట్రాలను షేక్ చేశాడు సింగర్ రమణ. పల్సర్ బైక్ పాట జనాలను ఎంత ఊపు ఊపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఒక్కసారిగా లైమె లైట్ లోకి వచ్చాడు జానపద సింగర్ రమణ. ఇక ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ పై భాను కోసం పాడిన పాటతో మరోసారి వార్తల్లో నిలిచాడు. భానుపై తనకున్న ప్రేమను పాట రూపంలో తెలిపాడు. దాంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా మరోసారి రమణ-భాను జంట వార్తల్లో నిలిచింది.
సింగర్ రమణ.. పల్సర్ బైక్ సాంగ్ తో ఒక్కసారిగా బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయాడు. దాంతో పలు షోలల్లో పాల్గొంటూ.. తన పాటలతో రెండు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్నాడు. గతంలో జబర్దస్త్ భానుపై ఓ పాటను పాడి తన ప్రేమను తెలియజేశాడు రమణ. తాజాగా మరోసారి తన ప్రేమను పాట రూపంలో తెలిపాడు. హోలీ సందర్భంగా గుండెజారి గల్లంతైందే అనే ఈవెంట్ లో రమణ-భానులు కలిసి సందడి చేశారు. నీ పేరుపై పాట పాడినప్పటి నుంచి మా ఊరుకి వెళ్తే.. భాను వదినని ఎప్పుడు తీసుకొస్తావని పిల్లలు అడుగుతున్నారని రమణ చెప్పుకురాగా.. ఈ మాటలు విని భాను నవ్వులు చిందించింది.
అనంతరం మరోసారి తన ప్రేమను పాటరూపంలో తెలిపాడు రమణ. ఇక ఈ ఈవెంట్ లో ఇద్దరు కలిసి బైక్ పై షికారు చేశారు. దాంతో సింగర్ రమణతో భాను లవ్ లో పడిందా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఈ హోలీ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పటిలాగే ఈ ప్రోమో అభిమానులను అలరించింది. ఓ రొమాంటిక్ సాంగ్ కు ముగ్గురు ముద్దుగుమ్మలు యాంకర్ సౌమ్యారావు, భాను, వర్షలు తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టించారు. కైపెక్కించే లుక్స్ తో హాట్ ఫెర్పామెన్స్ ఇచ్చారు.