ఆమె హీరోయిన్. తోటి నటుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది జరిగింది మార్చిలోనే. రెండు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు విడాకులిచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్. ఇప్పటికే చాలామంది హీరోహీరోయిన్లు, నటీనటులు అలా మ్యారేజ్ చేసుకున్నారు. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో విడాకులు ఎక్కువయ్యాయి. మనలాంటి సాధారణ వ్యక్తులు విడాకులు తీసుకుంటే ఎవరూ పట్టించుకోరు. అదే ఓ హీరోయిన్ లేదా నటి డివోర్స్ తీసుకుంటే మాత్రం కారణం ఏంటా అని ఆరా తీస్తారు. ఈ మధ్య కాలంలో అలా టాలీవుడ్ లోని ఓ నటి గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ అయితే జస్ట్ పెళ్లి జరిగిన రెండు నెలల్లోనే విడిపోయింది. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. తమిళ ఫేమస్ సీరియల్స్ లో ఒకటైన ‘సిప్పినీల్ ముత్తు’ విజయ్ టీవీలో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంయుక్త-విష్ణుకాంత్ గత కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేశారు. పెద్దల అంగీకారంతో మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా పెళ్లి ఫొటోలన్నీ సోషల్ మీడియాలో నుంచి డిలీట్ చేసేశారు. ఎవరికి వారు స్పెషల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడా కూడా విడాకులు అని ప్రస్తావించలేదు గానీ జరిగింది మాత్రం అదే. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా కొన్నేళ్ల సంసారం చేసి విడిపోతుంటారు. వీళ్లు మాత్రం జస్ట్ రెండంటే రెండు నెలల్లోనే బ్రేకప్ చెప్పేసుకున్నారు.
పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్లకు విష్ణుకాంత్-సంయుక్త మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయని.. అవి ఎంతకీ పరిష్కారం కాకపోవడంతోనే వీళ్లిద్దరూ విడిపోయారని సీరియల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఇది నెటిజన్స్ మధ్య చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే మన లైఫ్ లో పుట్టుక చావు మధ్య పెళ్లి మాత్రమే గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి శుభకార్యాన్ని పలువురు నటీనటులు కామెడీగా మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందోనని అనుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే జస్ట్ రెండు నెలలకే సీరియల్ హీరోయిన్ పెళ్లి పెటాకులు కావడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.