షణ్ముగప్రియ భర్త అరవింద్ గుండెపోటుతో చాలా చిన్న వయసులోనే చనిపోవడంతో.. తమిళ మీడియాలో ఆయన అలవాట్లపై జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ఆయనకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటూ కొంతమంది తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలు మరణిస్తూనే ఉన్నారు. వారి మరణంతో కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి తమిళ బుల్లితెర నటి జీవితంలో జరిగింది. శృతి షణ్ముగప్రియ.. ‘నటస్వరం’ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయిన నటి. ఈ మధ్యే ఆమె భర్త అరవింద్ గుండెపోటుతో కన్నుమూశారు. గతేడాది అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శృతి షణ్ముగప్రియ. అంతకు ముందు ఈ జంట కొన్ని రోజులు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమైన విషయం. అయితే బాధలో ఉన్న షణ్ముగప్రియ.. చాలా ఎమోషనల్ అవుతూ.. తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది.
” నేను జీవితంలో చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాను. చాలా మంది నన్ను ఓదార్చేందుకు ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలో అన్నీ యూట్యూబ్ ఛానెల్స్ , మీడియా వారందరికీ దయతలచి చెప్తున్నాను.. నా భర్త గుండెపోటుతో చనిపోయిన విషయం మీకు తెలిసిందే. డాక్టర్లు కూడా వెల్లడించారు. కానీ.. నిజం ఏంటో తెలియకుండా కొందరు ఆయన మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇంట్లో అందరూ పుట్టెడు దుఃఖంలో ఉన్నాము. మీ వ్యూస్ కోసం, లైకుల కోసం మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు” అంటూ చెప్పుకొచ్చింది.
షణ్ముగప్రియ భర్త అరవింద్ గుండెపోటుతో చాలా చిన్న వయసులోనే చనిపోవడంతో.. తమిళ మీడియాలో ఆయన అలవాట్లపై జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ఆయనకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటూ కొంతమంది తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షణ్ముగప్రియ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒకవైపు చిన్న వయసులోనే భర్తని కోల్పోయి.. షణ్ముగ అంత బాధలో ఉంటే.. ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఇక చిత్ర పరిశ్రమలో విషాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్, నటుడు శరత్ బాబు, ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు కైలాస్ నాథ్, తమిళ నటుడు మోహన్, వంటి ఎందరో సెలబ్రిటీలు చనిపోతున్నారు.