సినీ పరిశ్రమలో వివాదాలకు కొదువలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అలాంటి కోవలోకే వచ్చి చేరింది నటి రేఖ నాయర్.
సినీ పరిశ్రమలో వివాదాలకు కొదువలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అలాంటి కోవలోకే వచ్చి చేరింది నటి రేఖ నాయర్. సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేఖ, బిగ్‌బాస్‌లో షోలో కంటెస్టెంట్‌గా కూడా చేసింది. నటిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022లో ‘ఇరవిన్ నిహాల్’ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలాగే అంతకుముందు సన్ టీవీలో న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసిందని సమాచారం. తాజాగా, ఓ ఇంటర్యూలో పాల్గోన్న రేఖ నాయర్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘ఇటీవల మహిళలు చాలా సెక్సీగా బట్టలు వేసుకుంటున్నారు. దీంతో అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారు. మీ సంగతి ఏంటి?’ అని యాంకర్ ప్రశ్నించింది.
దానికి రేఖ సమాధానమిస్తూ.. ‘మగవాళ్ళు అమ్మాయిల నడుము మీద చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ కంప్లెంట్ చేయద్దు. అమ్మాయిలు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు’ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ‘నేను వేసుకునే బట్టల గురించి చాలా మంది మహిళలు అడుగుతుంటారు. అయితే నా నడుము కనిపించే బట్టలు వేసుకున్నప్పుడు.. ఓ వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే ఆనందిస్తాను. సాధరంణంగా నేను చీర కట్టుకుంటే నా నడుము కనిపిస్తుంది. బస్సులో వెళుతున్నప్పుడు ఓక వ్యక్తి నా తుంటి పై చేయి వేస్తే నాకు ఏమీ అనిపించదు. ఈ రోజుల్లో కూడా మహిళలు ఇలాంటి మనసత్వాలను దూరం చేసుకోవాలి. జాగింగ్ చేసేటప్పుడు,ఏదైనా పోటీలో పాల్గొన్నప్పుడు కూడా నడుము కనిపించే డ్రెస్ వేసుకుంటాను. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంద’ని రేఖా నాయర్ అన్నారు.
‘మీరు బట్టలు వేసుకునే విధానాన్ని ఎవరైనా మెచ్చుకున్నారంటే. అది అబ్బాయిలు మాత్రమే. వాళ్లు మెచ్చుకోకపోతే అర్ధం లేద’ని అన్నారు. ఆమె మాటలకు కొందరు ప్రశంసించగా, మహిళలు దీనిని వ్యతిరేకించారు. ప్రస్తుతం రేఖా నాయర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేఖా నాయర్ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.