నటీనటుల గురించి ప్రస్తావన రాగానే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుంటారులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే వాళ్లు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. హౌమ్ టూర్, ఫ్రిజ్ టూర్, బాత్రూమ్ టూర్, ఫామ్ హౌస్ టూర్ అని ఓ తెగ ఉదరగొడుతుంటారు. ఇంకా చెప్పాలంటే తమ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. అది నిజమా, లేదా ప్రమోషన్స్ కోసం డ్రామాలు ఆడుతున్నారా అనేది మనం అస్సలు కనుక్కోలేం. కొన్నిసార్లు మాత్రం సదరు నటీనటులే.. తమ సంపాదన గురించి చెబుతూ ఉంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సీరియల్స్ చూసేవాళ్లు చాలామంది ‘గృహలక్ష్మి’ సీరియల్ చూస్తుంటారు. అందులో తులసి పడే కష్టాలు చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతుంటారు. తులసి-సామ్రాట్ రిలేషన్ గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కస్తూరి.. నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాలో ఓ హీరోయిన్ గా చేసిందని, ‘పరంపర’ వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ కూడా చేసిందని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఇక ఈమె ఇన్ స్టా పోస్టులు చూస్తే.. యంగ్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చేలా ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది.
ఇక కస్తూరిని చూసే ఎవరికైనా సరే ఆమెది విలాసవంతమైన జీవితం గడుపుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఆమె చెన్నై మెట్రోలో ప్రయాణిస్తూ తన ఫోన్ పోగొట్టుకుంది. దీని మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు వెంటనే వెతికిపెట్టి ఇచ్చారు. దీంతో తెగ మురిసిపోయిన కస్తూరి.. చెన్నై పట్ల, అధికారుల పట్ల మరింత గౌరవం పెరిగిందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ‘నీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు కదా? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి రెస్పాండ్ అయింది. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని రీట్వీట్ చేసింది.
దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తన హెల్పింగ్ నేచర్ గురించి బయటపెట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే కస్తూరి శంకర్.. ఓ సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. తనకు ఉన్నంతలో చిన్న పిల్లలకు సహాయం చేస్తోందని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. మరి ‘గృహలక్ష్మి’ తులసి, తన సంపాదన-లైఫ్ గురించి చెప్పింది కదా. మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
I don’t own a car.
I don’t have tv.
I don’t use Air conditioning.
I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt— Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022
I used it to fund medical help for child cancer patients
— Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022