త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేకంటే.. మాటల మాంత్రికుడు అంటే తెలుగు ప్రేక్షకులు త్వరగా గుర్తుపడతారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. డైరెక్టర్‌గానే కాకుండా ఆయన కామెడీ డైలాగ్స్, ఆ కామెడీ టైమింగ్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కామెడీ డైలాగ్స్ ఎంత బాగా రాస్తారో.. ఎమోషనల్ డైలాగ్స్ కూడా అంతే డెప్త్ తో రాస్తారు. అందుకే ఆయన సినిమాలన్నా, డైలాగ్స్ అన్నా పడి చచ్చిపోతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా గురించి కాకుండా ప్రస్తుతం నెట్టింట త్రివిక్రమ్ ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.
అవేంటంటే.. త్రివిక్రమ్ తాజాగా ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆ బీఎండబ్ల్యూ కారును డెలివరీ తీసుకుంటున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ కారు ధర కూడా గట్టిగానే ఉందని చెబుతున్నారు. నిజానికి ఆ ఫొటోలో ఆ కారు మోడల్ ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. కానీ, ఆ కలర్‌ని బట్టి అది బీఎండబ్ల్యూ 7 సిరీస్ 740 లీటర్స్ మోడల్ కారుగా చెబుతున్నారు. అలా చూస్తే ఆ లగ్జరీ కారు ధర రూ.1.34 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఆ కారులో ఉన్నాయి. ఒకవేళ అది 7 సిరీస్ కారు కాకపోయినప్పటికీ దాని ధర రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం కారణంగా ఈ సినిమాకి కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మహేశ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తైంది. ఇప్పుడు డిసెంబర్ 8 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సీన్లను త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించి త్రివిక్రమ్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియలేదు.