కరోనాతో సినిమా థియేటర్లు తెరవకపోవటంతో దర్శక, నిర్మాతలు ఓటీటీని వేదికగా ఎంచుకుని తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇదే వేదిపై ఇప్పటికీ చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప మూవీ ఓటీటీ ద్వారానే విడుదల అయ్యింది. ఇక నేడు యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం మెల్లగా థియేటర్స్ తెరుచుకోవటంతో ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. ఇక సినిమా టీజర్స్, మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన నాటి నుంచి మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
మూవీ రివ్యూ:
హీరో (సత్యదేవ్) రామచంద్ర అలియాస్ రామ్ సినిమాలో న్యాయవాదిగా కనిపిస్తాడు. అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ హత్యకేసులో అమాయకపు కుర్రాడైన వాసు జైలుపాలవుతాడు. ఈ కేసును రీ ఓపెన్ చేసి హత్య కేసులో జరిగిన కీలక ఆధారాలను వెతికే పనిలో న్యాయవాదిగా తన విదిని నిర్వర్తిస్తాడు రామ్. ఇక దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి సినిమాను కాస్త ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇచ్చేలా మూవీని తెరకెక్కించాడు. కథ సాగే తీరు ప్రేక్షకులను కాస్త ఆలోచింపజేసేలా చిత్రీకరించాడు డైరెక్టర్. హీరో తన తెలితేటలతో కేసు పూర్వపరాలను సేకరించి రంగంలోకి దిగుతాడు. న్యాయవాదిగా రామ్ హత్య వెనుక జరిగిన పూర్వపరాలను తెలుసుకునేందుకు తన తెలివితేటలకు బాగా పని చెప్పాడు.
ఆ కేసును బయటకు లాగుతున్న కొద్ది హంతకులు మాయం చేస్తుండటంతో సినిమా కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. దీంతో ఎలాగైన కేసును గెలిచేందుకు రామ్ తన శక్తి మేర ప్రయత్నిస్తాడు. ఇక విరామ సన్నివేశంలో కథలో కాస్త నిజాలు తెలుస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ నుంచి ప్రేక్షకులకు కథను కాస్త ఆలోచించే దిశగా మలిచి ప్రేక్షకుల మెదళ్లకు పని చెప్పాడు దర్శకుడు. రామ్ తన వ్యక్తి గత జీవితాన్ని కేసుకి ముడిపెట్టే దిశగా కథ సాగుతుండటంతో క్రమక్రమంగా ఏం జరిగిందనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది.
ఇక కేసుకు సంబంధించిన ఆధారాలు రామ్ ఎలా రాబట్టాడు, అసలు డ్రైవర్ హత్య కేసులో ఆ అమాయకుడిని కుర్రాడి వాసుని ఎందుకు లాగారనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక మొత్తానికి న్యాయవాదిగా తన పాత్రకు న్యాయం చేశాడు హీరో సత్యదేవ్. ఇందులో అను అనే పాత్రలో నటించింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఇక ప్రేక్షకులు ఆశించినంతగా రోమాన్స్, ఆడిపాడటం అలాంటివి హీరో, హీరోయిన్ల మధ్య అంతగా కనిపించవనే చెప్పాలి. సెకండ్ ఆఫ్‌లో బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మొత్తానికి ఈ సత్యదేవ్ నటన సినిమాకు కాస్త ప్లస్ పాయింట్ గా నిలిచి సినిమా విజయానికి తోడ్పడింది.
సినిమా: తిమ్మరుసు
నటీనటులు: సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్; కళ: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్లు: వెంకట్ మాస్టర్, రియల్ సతీశ్
ప్రొడ్యూసర్స్: మహేశ్ కోనేరు, సృజన్
డైరెక్టర్: శరణ్ కొప్పిశెట్టి
సంస్థ: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్.ఒరిజినల్స్
బలాలు
కథ… కథనం
విరామ సన్నివేశాలు, సెకండ్ ఆఫ్
సత్యదేవ్ నటన
బలహీనతలు
ఫస్ల్ ఆఫ్‌లో కొన్ని సన్నివేశాలు కథలో అవసరం లేకున్నా లాగినట్లు అనిపిస్తాయి.
రేటింగ్: 2.5