ప్రభాస్, విజయ్ దేవర కొండ, మహేష్ బాబు, బాలకృష్ణ తదితరులు మల్లీప్లెక్స్ థియేటర్స్ నిర్మించి.. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సినిమా అనుభూతిని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న అమీర్ పేటలో గల సత్యం థియేటర్ స్థానంలో ఏఏఏ నిర్మించిన సంగతి విదితమే
సినిమా రంగంలోని నటీనటులు వ్యాపార రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈ తరం నటులు.. స్వకార్యం, స్వామి కార్యంతో కూడిన బిజినెస్‌పై దృష్టి సారించారు. అదే మల్టీపెక్స్ థియేటర్స్. ఇప్పటికే ప్రభాస్, విజయ్ దేవర కొండ, మహేష్ బాబు, బాలకృష్ణ తదితరులు మల్లీప్లెక్స్ థియేటర్స్ నిర్మించి.. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సినిమా అనుభూతిని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న అమీర్ పేటలో గల సత్యం థియేటర్ స్థానంలో ఏఏఏ నిర్మించిన సంగతి విదితమే. దీని యజమానుల్లో ఒకరు అల్లు అర్జున్. ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్ సహా సదానంద్ గౌడ్ ఏషియన్ మిగిలిన భాగస్వాములు.
ఎన్నో హంగులతో స్వరాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ థియేటర్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ థియేటర్‌లో స్క్రీనింగ్ కాబోతున్న తొలి సినిమా ప్రభాస్, కృతిసనన్ ఆది పురుష్. 3 లక్షల చదరపులు అడుగులున్న ఈ మాల్‌లో అత్యాధునిక వసతులున్నాయి. కార్ పార్కింగ్ కోసం 3 అంతస్థులు కేటాయించారు. నాల్గవ అంతస్థులో థియేటర్ ఉంది. విశాలవంతమైన సీటింగ్ నిర్మాణంతో పాటు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే లాస్పేస్ ను ఏర్పాటు చేశారు. మూడవ అంతస్థులో ఫుడ్ కోర్టు ఉంది. ఫుడ్ కోర్ట్ లో హల్దీరామ్, కృతుంగా, పిస్తా హౌస్, ఫస్ట్ పొపాయెస్ చికెన్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఇక థియేటర్లలోని స్క్రీన్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే.. ఏఏఏలో మొత్తం ఐదు స్క్రీన్‌లు ఉన్నాయి. స్క్రీన్ 1 అనేది 67 అడుగుల ఎత్తు, ఆట్మోస్ (ATMOS) సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌తో ఉంటుంది. స్క్రీన్ 2 అట్మోస్ సౌండ్‌తో కూడిన ఎపిక్ (EPIQ)లక్సన్ స్క్రీన్. మిగిలిన స్క్రీన్‌లు 4K ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటాయి, అలాగే అన్ని స్క్రీన్‌లు డాల్బీ 7.1 సౌండ్‌తో అమర్చబడి ఉన్నాయి. జూన్ 14వ తేదీన పూజా కార్యక్రమాలు నిర్వహించి, 15వ తేదీన మాల్, సినిమా థియేటర్లు, ఫుడ్‌కోర్టులను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించనున్నారు. మిగిలిన భాగస్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్ ఫ్రాంచైజ్, 800 జూబ్లీ అనే పబ్ నడుపుతున్న సంగతి విదితమే.