లైగర్.. ఆగస్టు 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్‌తో కొనసాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు నుంచే వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజైన తర్వాత అంతా మారిపోతుందని అంతా ఆశించారు. కానీ, ఇంకా పరిస్థితులు సద్దుమణిగినట్లు అయితే కనిపించలేదు. బాలీవుడ్‌లో అయితే బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ కూడా నడిచింది.
అందుకు కారణం విజయ్ దేవరకొండ ఆమీర్‌ఖాన్ సినిమాకు మద్దతుగా నిలవడమే. అలాగే లైగర్ సినిమా ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ కూడా ఒకడు కావడంతో ఈ బాయ్‌కాట్ ట్రెండ్ నడిచింది. అంతేకాకుండా బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందిస్తూ విజయ్ వాళ్లకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వకూడదు. వాళ్లని మనం కన్విన్స్ చేయలేం. నచ్చితే చూస్తారు అంటూ హిందీ వాళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై ప్రముఖ ఫిల్మ్ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ ఘాటుగా స్పందించారు. సినిమా విడుదలకు ఓ యూట్యూబ్ ఛానల్ వారిని లైగర్ సినిమా గురించి అడగ్గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నటీనటులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా చూస్తే చూడండి లేదంటే లేదు అనే ధోరణి సరైంది కాదంటూ చురకలు అంటించారు. విజయ్‌ని అనకొండ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“చూస్తే చూడండి లేదంటే లేదు అని కామెంట్ చేస్తున్నారు. అలా చూడకుండా వదిలేస్తే తాప్సీ పన్ను పరిస్థితి ఏమైంది? ఆమీర్ ఖాన్ పరిస్థితిత ఏమైంది? అక్షయ్ కుమార్ రక్షాబంధన్ ఏమైంది? ఓటీటీలో చూస్తారంటున్నారు. అలాంటప్పుడు ఓటీటీలో పని చేసుకోండి. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఓటీటీల్లో కూడా మీ సినిమాలు చూడరు. నువ్వు దేవరకొండ కాదు.. అనకొండ.. అనకొండలాగే మాట్లాడుతున్నావు” అంటూ వ్యాఖ్యానించారు.
“మా సినిమాని బాయ్‌కాట్ చేసుకోండి అంటూ ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నిర్మాత పరిస్థితి ఏంటి? నీ సినిమా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి? సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ పరిస్థితి ఏంటి? వారి గురించి ఆలోచించవా? ఈ హ్యాష్ ట్యాగ్ వ్యవహరాల్లోకి నటీనటులు దూరకండి. వాటికి దూరంగా ఉండండి. రాజకీయాలకు దూరంగా ఉండి చూడండి. మీ కెరీర్ ఎంత బాగుంటుందో” అంటూ మనోజ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. మనోజ్ దేశాయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.