Vikram Vedha: బాలీవుడ్ గత కొన్నేళ్లుగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్ టైంనుంచి అక్కడ ఓ మంచి హిట్ కూడా లేదు. వచ్చిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం బాలీవుడ్ సినీ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావటం. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ వేదికల వాడకం పెరిగిపోయింది. ఇంట్లో కూర్చుని జనం అన్ని బాషల సినిమాలను ఎగబడి చూశారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. ఆ మార్పుకు అనుగుణంగా బాలీవుడ్ సినిమాలు చేయలేకపోయింది. దాని ప్రభావంగా వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్లాపులుగా నిలిచాయి. పుష్ప రిలీజ్‌కు ముందు వరకు బాలీవుడ్ థియేటర్లు కళ లేకుండా విలవిలలాడిపోయాయి. పుష్ప హిట్‌తో ఒక్కసారిగా కళకళ్లాడాయి. తర్వాత కూడా సౌత్‌నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సృష్టించాయి.
దీంతో బాలీవుడ్‌లో అభద్రతా భావం, కసి పెరిగింది. ఓ మంచి హిట్టుకొట్టి తామేంటే నిరూపించుకోవాలన్న ఇదిలో పడింది. తాజాగా, విడుదలైన విక్రమ్ వేద ట్రైలర్ చూస్తే బాలీవుడ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్‌రోషన్‌లు నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వటం పక్కా అన్న ధీమాలో ఉంది బాలీవుడ్. హృతిక్, సైఫ్‌లు పోటాపోటీగా నటించారన్నది ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అన్ని ఎమోషన్లు కలగలిపిన సినిమా కావటంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా భారీ హిట్టు కొడితే మళ్లీ బాలీవుడ్‌కు పూర్వ వైభవం వస్తుందని హిందీ సినీ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. సౌత్ సినిమాల ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. విక్రమ్ వేద ఓ సౌత్ సినిమా రీమేక్. 2017లో తమిళంలో వచ్చిన విక్రమ్ వేద సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మాతృకలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించారు. ఒక వేళ విక్రమ్ వేద బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించినా అది సౌత్ సినిమా పుణ్యమనే అనుకోవాలి. మరి, విక్రమ్ వేద హిందీ రీమేక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sita Ramam: హిందీలో ‘సీతారామం’ రిలీజ్ కి తేదీ ఖరారు.. ఎప్పుడంటే?