సీతా రామం.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. దుల్కర్ సల్మాన్, సుమంత్, మృణల్ ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్లను పెట్టి డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి అశ్వినీ దత్ ప్రొడ్యూసర్ కావడం మరో విశేషం. ఈ సినిమాకి సంబంధించి బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఈ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “సీతా రామం ట్రైలర్ చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. ఈ మూవీని రష్యా, కశ్మీర్‌లో షూట్ చేశారు. దుల్కర్, సుమంత్, రష్మిక, మృణాల్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. ఇది కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది. కొన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలి. ఇంట్ల పూజగది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానం కదా?” అంటూ ప్రభాస్ సీతా రామం సినిమా గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు.
అయితే ఇదంతా పక్కన పెడితే సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ టీషర్ట్ ఏ కంపెనీకి చెందింది? దీని ధర ఎంత ఉంటుంది? అని వెతుకులాట మొదలు పెట్టారు. ఆ బ్లాక్ టీషర్ట్ డోల్స్ &గబ్బానా వారు డిజైన్ చేశారు. ఇది దాదాపు రూ.20 వేల వరకు ఉంటుంది.
అంతే కాకుండా ఈ టీ షర్ట్ వెనుక ఐదేళ్ల కథ ఉంది. అదేంటంటే.. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017లో ఒకసారి ప్రభాస్ ఇలాంటి టీషర్ట్ వేసుకుని కనిపించాడు. అయితే ఇదీ, అదీ ఒకటే అని కాదు. కానీ, ఇంలాంటి టీషర్ట్ అంటే ప్రభాస్ కు బాగా ఇష్టమని.. స్పెషల్ ఈవెంట్స్, అకేషన్స్ ఈ టీషర్ట్ ధరిస్తుంటాడని చెబుతున్నారు. ప్రభాస్ కు అంత ఇంష్టమైన టీషర్ట్ అని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈ టీషర్ట్ ఎక్కడ దొరుకుతుంది అని వెతికేస్తున్నారు. ప్రభాస్ టీ షర్ట్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.