ఈ మధ్యకాలంలో ఎలాంటి శుభకార్యం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికి అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సినీనటులు, సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు సైతం పెళ్ళైనా, పేరంటమైనా సోషల్ మీడియా అప్ డేట్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ ఒక్కటై అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అయితే.. ఇప్పుడు అదే జాబితాలో చేరుకున్నారు తెలుగు బుల్లితెర సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని గౌడ. తెలుగులో పాపులర్ అయినటువంటి 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్, కేరాఫ్ అనసూయ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ(సీరియల్ లో శివాని) త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు సన్నిహితుల సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కి బిగ్ బాస్ ఫేమ్ అరియానా, పలువురు సీరియల్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమర్ దీప్, తేజస్వినిల ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రెండు వేర్వేరు సీరియల్స్ లో హీరో, హీరోయిన్ అయిన అమర్, తేజస్వినిలది మరి ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రేమ పెళ్లి అయితే డిఫరెంట్ సీరియల్స్ లో నటిస్తున్న వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? అనే విషయం అభిమానులలో, నెటిజెన్స్ లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అమర్ - తేజస్వినిలు సంతోషంగా పూల దండలు మార్చుకుంటున్న వీడియో, ఫోటోలు నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న ఈ జంటకు నెట్టింట ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. మరి అమర్ దీప్, తేజస్విని గౌడల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews)